
దానితో ఆ ఫ్లైఓవర్ డిజైన్ లోనే లోపం ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిపుణుల కమిటిని వేసి, ఆ ఫ్లైఓవర్ ని తాత్కాలికంగా మూసి వేసింది. కమిటీలో ప్రపంచ బ్యాంకు రోడ్డు సేఫ్టీ విభాగం సలహాదారు ప్రొఫెసర్ నాగభూషణరావు, నిపుణులు డాక్టర్ టీఎస్ రెడ్డి, సహాయ ప్రొఫెసర్ శ్రీనివాస్ కుమార్ ప్రదీప్ రెడ్డి ఉన్నారు.
ఈ కమిటీ తన రిపోర్టులో ప్రభుత్వాన్ని తప్పుపట్టడం విశేషం. ఇండియన్ రోడ్డు కాంగ్రెస్ కు అనుగుణంగా నిర్మించినా వేగంగా వెళ్లే వాహనదారులకు ఇది సురక్షితంగా లేదని నిపుణుల కమిటీ తేల్చింది. అయితే.. ఇంజినీర్లు నిబంధనలకు అనుగుణంగా నిర్మాణం చేపట్టడంపైనే దృష్టి పెట్టారని, రెండు ప్రాణాంతకమైన మలుపులతో తక్కువ పొడవున్న పైవంతెన ఎలాంటి దుష్పరిణామాలకు తావిస్తుందనే కోణంలో చర్యలు తీసుకోలేకపోయారని అంచనా వేసింది.
ఫ్లైఓవర్ నిర్మాణానికి సరిపడా భూసేకరణ చెయ్యలేదని కూడా నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. కొన్ని మార్పులు కూడా కమిటీ సూచించింది. ఆ మార్పులు చేసే వరకూ ఫ్లైఓవర్ మూసి ఉంచడమే శ్రేయస్కరం అని ప్రభుత్వానికి నివేదించింది. 104 కిలోమీటర్ల స్పీడ్ తో కారు నడిపి ఆక్సిడెంట్ చేసిన కల్వకుంట్ల మిలన్ రావు తన తప్పు లేదని, ఫ్లైఓవర్ డిజైన్ లోపం వల్లే ఆక్సిడెంట్ జరిగిందని కోర్టు నుండి తన అరెస్టుపై స్టే తెచ్చుకున్న విషయం తెలిసిందే.
After making his directorial debut with Oke Oka Jeevitham, Shree Karthick is preparing for his…
The Rajinikanth - Kamal Haasan multistarrer directed by Nelson is back in the news. This…