
ప్రస్తుతం ‘ఫిదా సంబరాలు’ జరుపుకుంటోన్న చిత్ర యూనిట్, అందులో భాగంగా సుదర్శన్ 35ఎంఎం ధియేటర్ కు వెళ్ళగా, 9వ రోజు కూడా చిత్రం హౌస్ ఫుల్ బోర్డుతో ఆడుతున్న వైనానికి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు దిల్ రాజు. అయితే అశేష ప్రేక్షక జనం హీరోహీరోయిన్ల నుండి స్పందన కావాల్సిందిగా కోరుతుండగా, వరుణ్, సాయిపల్లవిలు మాత్రం అలా ప్రేక్షకులను చూస్తూ నిల్చుండిపోయారు.
దీంతో ప్రేక్షకులకు అభివాదం చేయాల్సిందిగా స్వయంగా సాయిపల్లవి చేయి పట్టుకుని ఊపిన దిల్ రాజు, ఆ తర్వాత వరుణ్ తేజ్ చేయి కూడా పట్టుకుని ఊపారు. అయినప్పటికీ వారిద్దరూ మళ్ళీ అలాగే నిల్చుండిపోవడంతో, దర్శకుడు శేఖర్ కమ్ములకు చెప్తూ… వీరిద్దరికీ కాస్త యాక్టింగ్ నేర్పించండి… అంటూ చమత్కరించాడు. విశేషం ఏమిటంటే… ఇంత వ్యాఖ్యలు చేసినా కూడా సాయిపల్లవి ఓ చేయి ఊపగా, వరుణ్ మాత్రం సిగ్గుపడుతూ అలా ఉండిపోయాడు.
A social media user who posted a meme about Yash's Toxic on August 26 has…
కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరు. కాంగ్రెస్ నేతలే తమ పార్టీని గద్దె దించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఇతర పార్టీలు ఎన్నికలలో గెలిచి…