Telugu

టక్ జగదీష్ గా నాని

నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా, శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న చిత్రాన్ని కాసేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు. చిత్రానికి `ట‌క్‌…జ‌గ‌దీష్‌` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. నాని న‌టిస్తున్న 26వ చిత్రమిది. హీరో షర్ట్ టక్ చేసుకుంటున్న ఫోటోని బ్యాక్ పోజ్ లో టైటిల్ పోస్టర్ గా విడుదల చేశారు. నిన్నుకోరి వంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం…ట‌క్ జ‌గ‌దీష్‌.

షైన్ స్క్రీన్స్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ ఏడాది `మ‌జిలీ` వంటి సూప‌ర్ హిట్‌ను అందుకున్న‌ డైరెక్ట‌ర్ శివ నిర్వాణ మరో సూపర్ స్క్రిప్ట్‌తో `ట‌క్ జ‌గ‌దీష్‌` రూపొందించ‌నున్నారని చిత్ర బృందం అంటుంది. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం త‌ర్వాత నాని స‌ర‌స‌న రీతూవ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు.

ADVERTISEMENT

అలాగే `కౌస‌ల్య‌కృష్ణ‌మూర్తి` ఫేమ్ ఐశ్వ‌ర్యా రాజేష్ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. నాని ప్రస్తుతం తన 25వ సినిమా వీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది. 2020 ప్ర‌థ‌మార్థంలో టక్ జగదీష్ సినిమా రెగ్యుల‌ర్‌ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి ప్ర‌సాద్ మూరెళ్ళ సినిమాటోగ్ర‌ఫీ, మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.

ఈ ఏడాది నాని.. గౌతమ్ తిన్ననూరి దర్వత్వంలో చేసిన ‘జెర్సీ’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమా ఇప్పుడు బాలీవుడ్ లో కూడా రూపొందుతుంది. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేసిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. దానితో ఈ రెండు సినిమాల మీద భారీగా ఆశలు పెట్టుకున్నాడు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Jogi Ramesh Daughter-in-Law’s Accident Sparks Suspicion

A car accident involving Meghana, daughter-in-law of former YSRCP minister Jogi Ramesh, has raised concerns…

34 minutes ago

అయ్యో పేర్నీ.. జగన్‌కి ప్రాణ భయమని చెప్పేస్తే ఎలా?

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆయన సోదరి షర్మిలకు మధ్య ఆస్తి వివాదాలు అందరికీ తెలిసిందే. అయితే ఆ వివాదాలు…

39 minutes ago