
సాధారణంగా ఆస్కార్ వేడుకలు నిర్వహించే సమయంలో ఆహూతులకు భారీ విందు ఏర్పాటు చేస్తారు. ఈ విందులో చాలా ఆహార పదార్థాలు మిగిలిపోయాయి. మామూలుగా అయితే ఇలాంటి వేస్టేజీని పారబోస్తారు. ఇక్కడే ఫ్రీదా పింటో మంచి ఐడియాతో పని చేసింది. ఈ విందు ఏర్పాట్లు చేసిన కోపియా హోటల్ తో కలిసి అలా మిగిలిపోయిన ఆహారపదార్థాలను సేకరించి, వాటిని ప్యాక్ చేయించి, లాస్ ఎంజెలెస్ లోని నిరాశ్రయులు, నిరుపేదలకు పంచిపెట్టింది. ఈ మేరకు ఇన్ స్టాగ్రాంలో ఓ పోస్టు చేసింది.
ఆస్కార్ లో పాల్గొనడం ఆనందంగా ఉందని, అంతకంటే కొపియా హోటల్ తో కలిసి చేసిన మంచి పని మరింత ఆనందాన్నిచ్చిందని పేర్కొంది. ఈ బ్లాక్ బ్యూటీ చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. రెడ్ కార్పెట్ పై అందాల ప్రదర్శనతో ప్రపంచ దృష్టిని ఆకట్టుకోవడమే లక్ష్యంగా వచ్చే హీరోయిన్లకు షాక్ నిచ్చే విధంగా, ఓ మంచి పనితో ప్రపంచం మొత్తాన్ని తన వైపుకు తిప్పుకుని, అభినందనలతో ముంచెత్తే విధంగా చేసుకుంది ఈ ఇండియన్ ఆరిజిన్ బ్యూటీ.
Anaira Gupta effortlessly casts a spell of timeless glamour in her latest sunlit photoshoot, proving…
Spirit is reportedly undergoing a huge change behind the scenes. According to unverified rumors, director…