Telugu

నిజాయితీకి ఉన్న విలువ అది… శభాష్ యువాన్హుయ్..!

ఫూ యువాన్హుయ్… మహిళల 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న విజేత. ముందు రోజు జరిగిన 4X100 మీటర్ల మెడ్లే రిలేలో చైనా టీంలో భాగంగా పోటీపడింది. ఈ పోటీలో ఆమె సరిగ్గా ఈదలేకపోయింది. ఫలితంగా చైనా టీము నాలుగో స్థానానికే పరిమితమైంది. ఆపై 24 గంటల్లోనే 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ లో పతకాన్ని సాధించింది. ఆపై చైనా మీడియాతో మాట్లాడుతూ…

“నిన్న నేను బాగా ఈతకొట్టలేకపోయాను. నా టీమ్ విజయానికి సహకరించలేదు” అని చెప్పగా, ఏదైనా సమస్యా? అని ప్రశ్నించిన మీడియాకు “నిన్న నాకు పీరియడ్స్ వచ్చాయి. ఆ సమయంలో కనీసం నడవలేను. సరిగ్గా ఊపిరి కూడా పీల్చుకోలేను. అలాంటప్పుడు ఈత కొలనులో దిగాల్సి వచ్చింది” అని ఫూ సింపుల్ గా సమాధానం ఇచ్చింది. నిజాయితీ నిండిన ఆమె సంజాయిషీ చైనాలో వైరల్ అయింది.

ADVERTISEMENT

సామాజిక మాధ్యమాల్లో ఓదార్పు వెల్లువలా మారగా, ఆమెపై కోట్లాది మంది చైనీయులు ఆప్యాయతను కురిపించారు. ఓ బహిరంగ వేదికపై నెలసరి గురించి ఆమె మాట్లాడటాన్ని ఒకరిద్దరు విమర్శించినా అత్యధికులు యువాన్హుయ్ కు మద్దతుగా నిలిచారు.

Share
Published by

Recent Posts

బరిలో గెలిచింది ఇంట్లో ఓడింది.. పాపం రెజ్లర్ అశ్విని

మహారాష్ట్ర ఆడపులిగా పేరు గాంచిన మహిళా రెజ్లర్ అశ్విని మనోహర్ పాల్ తన ముగ్గురు పిల్లలతో కలిసి దారాశివ్ జిల్లాలోని…

29 minutes ago

Paparazzi Push Too Far, Salman Khan Hits Back

Salman Khan has lost his cool at the paparazzi once again. This time, the incident…

29 minutes ago