
“ఆయన ఎప్పుడు ప్రశ్నిస్తాడో? ఎప్పుడు జవాబు ఇస్తాడో ఆయనకే తెలీదు. ప్రశ్నిస్తా అని చెప్పుకుని ఓట్లు అడిగి ఇప్పుడు ప్రశ్నించడం కూడా మర్చిపోయాడు. అసలు ఆయన వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తాడో లేదో కూడా ఆయనకే తెలీదు,” అని హర్షకుమార్ విమర్శించారు. సమైఖ్య ఆంధ్ర ఉద్యమంలో ఆయన కాంగ్రెస్ పార్టీనుండి సస్పెండ్ అయ్యారు.
తరువాత కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో జాయిన్ అయ్యి 2014 లో అమలాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటినుండి రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. మొన్న ఆమధ్య కాంగ్రెస్ పార్టీ పోలవరం సభలో ప్రత్యక్షం అయ్యారు. అప్పటినుండి మళ్ళి కాంగ్రెస్ లో చేరతారా అని ఊహాగానాలు సాగుతున్నాయి.
అమెరికాలోని పాఠశాలలపై దుండగులు తుపాకులతో కాల్పులు జరిపారని, పలువురు విద్యార్ధులు గాయపడ్డారనో, చనిపోయారనో వార్తలు తరచూ వింటూనే ఉన్నాము. ఇప్పుడు…
Aakasamlo Oka Tara, starring Dulquer Salmaan and directed by Pavan Sadineni, has been generating interest…