Telugu

“గాయపడ్డ సింహం” సినిమా రివ్యూ: సిల్లీ సింహం!

చిత్రం: గాయపడ్డ సింహం

M9 రేటింగ్: 1.75/5

ADVERTISEMENT

విడుదల తేదీ: మే 01, 2026

తారాగణం: తరుణ్ భాస్కర్, జేడీ చక్రవర్తి, శ్రీవిష్ణు, ఫారియా అబ్దుల్లా, శుభలేఖ సుధాకర్, హర్షవర్ధన్ తదితరులు

నిర్మాణ సంస్థ: సప్త అశ్వ మీడియా వర్క్స్ – పిఓవి స్టోరీస్ – జీ స్టూడియోస్

దర్శకత్వం: కశ్యప్ శ్రీనివాస్

సంగీతం: స్వీకర్ అగస్తి

నిర్మాత: కల్యాణ చక్రవర్తి మంతిన – భానుకిరణ్ ప్రతాప – విజయ్ కృష్ణ లింగమనేని – ఉమేష్ కుమార్ భన్సాల్

ఛాయాగ్రహణం: విద్యాసాగర్ చింతా

కూర్పు: విప్లవ్ నైషధం

హీరోగా వరుస పరాజయాలు చవిచూస్తున్న తరుణ్ భాస్కర్ నటించిన తాజా చిత్రం “గాయపడ్డ సింహం”. కశ్యప్ శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రానికి పవన్ సాదినేని క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం విశేషం. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకోగలిగిందో చూద్దాం..!!

కథ:

హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ సింపుల్ & బోరింగ్ లైఫ్ లీడ్ చేస్తుంటాడు దరహాస్ (తరుణ్ భాస్కర్). ప్రేమించిన అమ్మాయి (మానస చౌదరి) కోసం అమెరికా వెళ్లి, అక్కడ ట్రంప్ కొత్త రూల్ కారణంగా భంగపడి ఒక్కరోజులోనే వెనక్కి వచ్చేస్తాడు.దాంతో సొసైటీలో పరువు పోగొట్టుకొని.. తన ఈ దుస్థితికి కారణమైన ట్రంప్ పై పగ తీర్చుకోవాలనుకుంటాడు.

దాని కోసం దరహాస్ ఏం చేశాడు? దరహాస్ పంతం కారణంగా ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది? అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు:

తరుణ్ నటుడిగా ఒక సినిమా మొత్తాన్ని లీడ్ చేసే స్థాయికి ఇంకా చేరుకోలేదు. కామెడీ టైమింగ్ కాస్త ఇంప్రూవ్ అయ్యింది కానీ.. చాలా ఎమోషన్స్ ను పండించలేక బ్లాంక్ ఫేస్ పెట్టేస్తున్నాడు. బ్యాక్ లాగ్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి కాబట్టి ఇకనైనా తరుణ్ దర్శకత్వానికి ఫిక్స్ అయ్యి.. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలకి పరిమితం అయితే బెటర్.

జేడీ చక్రవర్తి క్యారెక్టర్ కొత్తగా ఉంది. అయితే దాన్ని సరిగా ఎక్స్ ప్లోర్ చేయలేదు. అతడికి ఒక మంచి సీన్ పడిన తర్వాత సడన్ గా పాత్ర మాయమైపోతుంటుంది. ఫస్టాఫ్ & సెకండాఫ్.. రెండు చోట్ల అదే సమస్య. అతడి సరిగా వాడుకోలేదు అని చెప్పొచ్చు.

శ్రీవిష్ణు క్యామియో ఎఫెక్టివ్ గా లేదు. అతడి క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉన్నా.. దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం ఆసక్తికరంగా లేదు. శుభలేఖ సుధాకర్ ను కేవలం కేజీఎఫ్ సెటప్ రీక్రియేషన్ కోసం ఎంచుకున్నారే కానీ.. ఆయన వల్ల సినిమాకి ఒరిగింది ఏమీ లేదు. హీరోయిన్లు ఫారియా & మానసవి చాలా చిన్న పాత్రలు. ఉన్నంతలో పర్వాలేదనిపించుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు:

స్వీకర్ అగస్తి మ్యూజిక్ డీసెంట్ గా ఉంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం విషయంలో కొత్తగా ప్రయత్నించాడు. విద్యాసాగర్ చింతా సినిమాటోగ్రఫీ వర్క్ ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండు అనిపించింది. కలర్ పేలెట్ & గ్రేడింగ్ డిఫరెంట్ గా ఉంది కానీ.. ఫ్రెష్ ఫీల్ ఇవ్వలేకపోయింది. విప్లవ్ నైషధం స్క్రీన్ ప్లే విషయంలో లీనియర్ & నాన్ లీనియర్ ఫార్మాట్స్ ను చిత్రవిచిత్రంగా ట్రై చేసి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు.

రచయిత సూర్య ప్రకాష్ జ్యోసుల రాసుకున్న పాయింట్ క్రేజీ ఉంది కానీ.. దాని ఎస్టాబ్లిష్మెంట్ & డీలింగ్ లో పట్టు లేదు. ముఖ్యంగా పాత్రలు మరీ ఎక్కువైపోయేసరికి.. చివరికి కిక్ ఇచ్చే క్యారెక్టర్స్ లేకుండా అయిపోయాయి.

దర్శకుడిగా కశ్యప్ శ్రీనివాస్ ప్రతిభకు తగ్గ డెబ్యూ ఇది కాదు అనిపించింది. అతడి వెబ్ సిరీస్ “బ్రేకప్ కన్సల్టెంట్” ఇంకా కొత్తగా ఉంటుంది. ఒక సిల్లీ ప్లాట్ లైన్ ను ఆసక్తికరంగా చెప్పడంలో తడబడ్డాడు కశ్యప్. ఆలోచనలో ఉన్న క్రేజీ నెస్ ఆచరణలో లేకపోవడమే పెద్ద మైనస్. సెకండాఫ్ మొత్తం స్పూఫులతో నింపేశాడు. ఒక్క “పోకిరి” స్పూఫ్ తప్ప వేరేవి సరిగా వర్కవుట్ అవ్వలేదు. “సలార్” స్పూఫ్ థాట్ బాగున్నా.. దాని ప్లేస్మెంట్ & ఎగ్జిక్యూషన్ లో క్లారిటీ ఉండదు. అందువల్ల మిగతా స్పూఫ్ లు పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. అక్కడక్కడా కొన్ని డైలాగ్స్ పేలాయి కానీ.. అవి సినిమాని గట్టెక్కించలేకపోయాయి. ఓవరాల్ గా డెబ్యూతో అలరించలేకపోయాడు కశ్యప్ శ్రీనివాస్.

విశ్లేషణ:

ప్రస్తుతం మన ప్రేక్షకులు ఇంటర్నేషనల్ కంటెంట్ కి అలవాటు పడ్డారు. అందువల్ల.. జనాల్ని థియేటర్లో కూర్చోబెట్టడం అనేది అంత ఈజీ కాదు. సింగిల్ లైన్ లో కొన్ని కథలు బాగుండొచ్చు. పేపర్ మీద ఆసక్తికరంగా ఉన్న ఆ పాయింట్ ఓ పూర్తిస్థాయి సినిమాగా ఎలా ఉంటుంది అని బేరీజు వేయడంలో మన దర్శకనిర్మాతలు విఫలమవుతున్నారు. “గాయపడ్డ సింహం” కూడా ఆ కేటగిరీ సినిమానే. పాయింట్ లో కొత్తదనం ఉన్నా.. డీలింగ్ లో అది లోపించి ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయలేక గర్జించనాల్సిన సింహం కాస్త సర్కస్ ఫీట్లు చేస్తూ చతికిలపడింది.

ఓవరాల్ గా.. సిల్లీ సింహం!

M9 రేటింగ్: 1.75/5

Share
Kalyan

I strongly believe reviews are personal opinions. At the same time, they should help audiences set the right expectations without bias. That’s the principle I follow. We’ve noticed there is a lot of confusion around r…

Recent Posts

తెలంగాణలో మైండ్ గేమ్ పాలటిక్స్.?

తెలంగాణ రాజకీయాలలో రేవంత్ vs కల్వకుంట్ల మధ్య మైండ్ గేమ్ పాలటిక్స్ నడుస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పై బురద జల్లేందుకు…

14 minutes ago

జగన్‌ వార్నింగ్ ఇస్తే చంద్రబాబు దిగొచ్చారటగా?

అవును! నిజమే! జగన్‌ ఒక్క వార్నింగ్ ఇచ్చేసరికి సిఎం చంద్రబాబు నాయుడు హడావుడిగా రాష్ట్రంలో కరువు మండలాలు ప్రకటించేందుకు సిద్దమయ్యారట!…

18 minutes ago