
గాలి జనార్ధన్ రెడ్డి కూతురి వివాహం అత్యంత వైభవంగా జరగనున్న విషయం తెలిసిందే. ఈ వివాహ వేడుకకు తయారైన శుభలేఖయే ఈ గాలి గారి ‘మాయాబజార్’ మరి. ఓ పెట్టె మాదిరి రూపుదిద్దుకున్న ఈ శుభలేఖ ఓపెన్ చేయగానే, ఓ ఎల్సీడీ స్క్రీన్ దర్శనమిచ్చి, అందులో ఒక నిముషం పాటు ‘గాలి ఫ్యామిలీ అండ్ కో’ వీడియో ప్లే అవుతుంది. ఆ వీడియోలో గాలి కుటుంబ సభ్యులంతా తమ ఇంట వివాహ మహోత్సవానికి ఆహ్వానం పలుకుతున్నారు.
ఈ వీడియోతో పాటు సహజంగా ఉండే అక్షరపు ఆహ్వానం కూడా ఉందనుకోండి. నవంబర్ 16వ తేదీన రాజీవ్ రెడ్డితో జరగబోయే ఈ వేడుక కోసం కొన్ని వందల కోట్లను గాలి మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు చేస్తున్నారన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. దానికి ఉదాహరణే ఈ శుభలేఖ. ఈ ఒక్కో లేఖకు అయిన ఖర్చు దాదాపుగా 6 వేల రూపాయలుగా తెలుస్తోంది. దేశంలోని ప్రముఖ సెలబ్రిటీలంతా గాలి ఇంట సందడి చేయనున్నారన్న టాక్ కూడా ఉంది.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…