
ఈ సందర్భంగా కాపు నేతలు బాలాజీ, ఆదినారాయణ రావు తదితరులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు, విలేఖరులు పార్టీ మారడం గురించి ప్రశ్నించారు.
దానిపై గంటా శ్రీనివాసరావు స్పందిస్తూ, “నేను పార్టీ మారుతున్నానని ఎవరికీ చెప్పలేదు. కానీ మారుతున్నానని మీరే రాసేస్తున్నారు. ముహూర్తం కూడా మీరే పెట్టేస్తున్నారు. నాకు సంబందం లేకుండా నా గురించి ఏవేవో మీరు రాసుకొంటే దానికి నేను ఎలా జవాబు చెప్పగలను. ఒకవేళ పార్టీ మారే ఆలోచన చేస్తే నేనే మీ అందరినీ పిలిచి చెపుతాను కదా?” అని అన్నారు.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి నేతలు జోరుగా “ఇదేం ఖర్మ రాష్ట్రానికి?” పేరుతో ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలని అమలుచేస్తున్నారు. అంతకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా “బాదుడే బాదుడు” కార్యక్రమం జోరుగా నిర్వహించారు. కానీ ఈ రెండు కార్యక్రమాలలో పాల్గొనని గంటా శ్రీనివాసరావు కాపునాడు సభలో మాత్రం పాల్గొనబోతున్నారు.
ఈవిషయం ఆయనే స్వయంగా నేడు ధృవీకరిస్తూ, “ఈరోజుల్లో సామాన్య ప్రజలకి కూడా రాజకీయాలతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధం ఉంటోంది. కనుక ఎవరైనా లేదని చెపితే అది నమ్మలేము. కాపునాడు బహిరంగసభకి అటువంటి ఆలోచనలు ఉన్నాయో లేవో నాకు తెలీదు కానీ పెద్దలు ఈ సభ నిర్వహించాలని నిర్ణయించి ఏర్పాట్లు చేస్తున్నారు. నేను దీనికి సారధ్యం వహించడం లేదు. కేవలం వారితో కలిసి పాల్గొంటున్నాను,” అని అన్నారు.
సామాన్య ప్రజలకి రాజకీయాలతో సంబందం ఉన్నా లేకపోయినా గంటా శ్రీనివాసరావుకి ఖచ్చితంగా ఉంది కనుకనే కాపునాడు సభలో భాగస్వాములవుతున్నారు. ఎన్నికలకి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, అన్ని పార్టీలు అప్పుడే కులాలవారీగా ఇటువంటి సభలు, సమావేశాలు జరుపుతూ వారిని ప్రసన్నం చేసుకొనేందుకు తిప్పలు పడుతున్నాయి. కనుక గంటా శ్రీనివాసరావు కూడా తాను ఏ పార్టీలో చేరాలనే విషయంపై కాపునేతల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరించి తదనుగుణంగా పార్టీ మారడానికి సిద్దపడుతున్నట్లున్నారు. తాను ఏ పార్టీలో చేరితే కాపులందరూ తనకే ఓట్లు వేస్తారో బహుశః గంటా శ్రీనివాసరావు తెలుసుకోవాలనుకొంటునట్లున్నారు. అందుకే టిడిపి కార్యక్రమాల కంటే కులసభలలో పాల్గొనడం ముఖ్యమని భావిస్తున్నట్లున్నారు.
The fifth T20I between India and West Indies was washed out due to rain at…
Vijay Deverakonda’s Ranabaali is trying to maintain momentum at the box office after receiving mixed…