
“అఖండ నీరాజనాలతో 77 కోట్ల పై రాబడితో శకపురుషుడు సాధించిన చారిత్రాత్మక విజయం” అని చెప్తూ విడుదల చేసిన పోస్టర్ తో ఈ సినిమా కలెక్షన్స్ బయటకు వచ్చాయి. అయితే ఇవి గ్రాస్ కలెక్షన్సా లేక షేరా అన్నది తేలాల్సి ఉండగా, సినీ వర్గాల సమాచారం మేరకు, శాటిలైట్, ఆడియో మరియు ధియేటిరికల్ హక్కులు తదితరాలన్నీ కలిసి ఉన్నాయని తెలుస్తోంది. ఏది ఏమైనా ఇలాంటి సినిమాను అతి తక్కువ కాలంలో తీసిన ఖ్యాతిని క్రిష్ సొంతం చేసుకోగా, ప్రతిష్టాత్మక 100వ సినిమాకు చారిత్రాత్మక కధను ఎంపిక చేసుకుని బాలయ్య బాబు చరిత్ర సృష్టించారు.
ఈ ఉత్సాహంతోనే మరిన్ని పౌరాణిక, చారిత్రాత్మక చిత్రాలలో నటిస్తానని బాలకృష్ణ ప్రకటన చేసారు. అందులో భాగంగానే ఎన్టీఆర్ బయోపిక్ మరియు మరో చారిత్రాత్మక సినిమాకు త్వరలో శ్రీకారం చుట్టబోతున్నారని తెలుస్తోంది. అయితే 101వ సినిమాగా మాత్రం పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. పూరీ సినిమా అంటే మూడు, నాలుగు నెలల్లోనే పూర్తవుతుంది గనుక, ఈ ఏడాదిలోనే మరో సినిమాతో నందమూరి నటసింహం ప్రేక్షకులను పలకరించవచ్చు.
Anaira Gupta effortlessly casts a spell of timeless glamour in her latest sunlit photoshoot, proving…
Spirit is reportedly undergoing a huge change behind the scenes. According to unverified rumors, director…