
అయితే ఈ ట్వీట్ పై నెటిజన్లు సరదా కామెంట్స్ చేస్తున్నారు. విడుదల తేదీని ప్రకటించారు గానీ, అది ఏ సంవత్సరమో తెలపలేదు అంటూ సెటైర్లు వేస్తున్నారు. కాసేపు నవ్వుకోవడానికి బాగానే ఉంటాయి గానీ, అది వచ్చే ఏడాది కాకుండా మరుసటి ఏడాది అయితే తప్పకుండా చెప్పేవారు కదా అంటూ మరికొందరు ఎదురు కామెంట్స్ చేస్తూ కాలయాపన చేస్తున్నారు.
సరదా ఉన్న సదరు సంగతులను పక్కన పెడితే, బాలయ్య సినిమా విడుదల తేదీ ఖరారు కావడంతో, ప్రస్తుతం అందరి చూపులు సహజంగా మెగాస్టార్ పైకి మళ్ళుతాయి. ఈ సినిమా కూడా సంక్రాంతికే ప్లాన్ చేసామని చిత్ర యూనిట్ ఎప్పుడో చెప్పింది. అయితే ఇటీవల షూటింగ్ జరుగుతున్న విధానం మాత్రం సంక్రాంతికి రాకపోవచ్చన్న సంకేతాలు వచ్చాయి. ఒకవేళ సంక్రాంతి తప్పుకుంటే, సమ్మర్ కే మెగాస్టార్ ఎంట్రీ ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అయితే సినీ ప్రేక్షకులు మాత్రం ఈ రెండు సినిమాలు ఒకసారి విడుదలైతేనే ఆ మజా ఉంటుంది అంటున్నారు.
The interesting part of the Epic trailer launch was not just Vijay Deverakonda’s absence and…
Karthi is returning to the silver screen with the highly anticipated spy thriller Sardar 2,…