
1 మిలియన్… 2 మిలియన్ క్లిక్స్ ను దాటుకుని తాజాగా 3 మిలియన్ మార్క్ ను అందుకోవడం విశేషం. అది కూడా కేవలం 40 గంటల్లోనే! తొలి 20 గంటల్లోనే 2 మిలియన్ క్లిక్స్ ను అందుకుని ఆల్ టైం రికార్డులు సృష్టించిన ‘శాతకర్ణి,’ మలి 20 గంటల్లో మరో 1 మిలియన్ క్లిక్స్ ను అందుకుని, ఇప్పటికీ యూ ట్యూబ్ లో నెంబర్ 1 ట్రైలర్ గా ట్రెండ్ అవుతోంది. ‘ధృవ, ఖైదీ నంబర్ 150’ ట్రైలర్స్ కూడా యూ ట్యూబ్ లో బాగానే క్లిక్స్ ను అందుకున్నాయి గానీ, వాటిని మించిన తక్కువ సమయంలో ‘శాతకర్ణి’ సరికొత్త రికార్డులను సెట్ చేస్తోంది.
ఇదే దూకుడు సినిమా విడుదలైన తర్వాత కూడా చూపించగలిగితే… బాక్సాఫీస్ వద్ద “గౌతమీపుత్ర శాతకర్ణి” రికార్డులకు ఎదురుండకపోవచ్చు. ఓ పక్కన సంక్రాంతి బరిలో నిలిచిన ‘ఖైదీ’ సినిమా పట్ల విమర్శలు వ్యక్తం కావడం, మరో పక్కన ‘శాతకర్ణి’కి ప్రశంసలు లభిస్తుండడంతో… ఓపెనింగ్స్ పరంగా కూడా భారీ రికార్డులు కొల్లగొడుతుందన్న అంచనాలు ట్రేడ్ వర్గాల్లో మొదలయ్యాయి. మొత్తానికి ఓ మంచి కధతో ప్రేక్షకుల ముందుకు వస్తే… ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారో బాలయ్య సినిమా ట్రైలర్ నిరూపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
కూటమి ప్రభుత్వం ఒకేసారి అనేక అభివృద్ధి పనులు సమాంతరంగా, విజయవంతంగా చేస్తూ ముందుకు సాగుతోంది. అలాగే అనేక సంక్షేమ పధకాలు…
The last time YS Jagan took to the streets, he completed the historic Praja Sankalpa…