Telugu

బాలయ్య సాధిస్తే హ్యాట్రిక్… చిరు అయితే లెక్కల సవరణ..!

సంక్రాంతి పోటీకి సర్వం సిద్ధమవుతోంది. ఆయా హీరోలకు రెండూ ప్రతిష్టాత్మక సినిమాలే కావడంతో ‘బాలయ్య వర్సెస్ చిరు’ ఎపిసోడ్ సినీ అభిమానులకు మాంచి ‘కిక్’నిస్తోంది. ఎవరికి వాళ్ళు తమ సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. ‘ఖైదీ’ కమర్షియల్ సినిమాగా విడుదల కానుండగా, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చారిత్రాత్మక చిత్రంగా విడుదల అవుతోంది. ఈ రెండు సినిమాలు హిట్టయితే టాలీవుడ్ బాక్సాఫీస్ పంట పండినట్లే. కానీ, గతంలో సంక్రాంతికి తలపడ్డ ‘బాలయ్య వర్సెస్ చిరు’ ఎపిసోడ్స్ లో విజయం ఒకరి వైపుకే వెళ్ళడం గమనించదగ్గ అంశం.

చివరిసారిగా 2004లో బాలకృష్ణ ‘లక్ష్మీ నరసింహా’ను విడుదల చేయగా, చిరు ‘అంజి’ చిత్రాన్ని రిలీజ్ చేసారు. ఈ రెండింటిలో బాలయ్య సినిమా పైచేయి సాధించింది. అలాగే అంతకుముందు 2001లో ‘మృగరాజు – నరసింహనాయుడు’ చిత్రాలు తలపడ్డాయి. ఇందులో ఆధిపత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా! నరసింహం దెబ్బకు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించబడ్డాయి. అలాగే 2000లో చిరు ‘అన్నయ్య’ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాగా, బాలయ్య ‘వంశోద్ధారకుడు’గా వచ్చారు. ఇక్కడ మెగాస్టార్ తన రేంజ్ ఏంటో చూపించారు.

ADVERTISEMENT

ఇలా గత మూడు ఎపిసోడ్స్ లో రెండు సందర్భాలలో నందమూరి నటసింహం పైచేయి సాధించగా, మెగాస్టార్ ఒకసారి ప్రతాపం చూపారు. దీంతో ఈ సారి ఎవరు విజయాన్ని అందుకుంటారో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. రెండూ విజయం సాధిస్తే… సినీ ప్రేక్షకులకు అంతకు మించిన పండగ మరొకటి ఉండదు. ఒకవేళ బాలయ్య అందుకుంటే మాత్రం ‘హ్యాట్రిక్’ నమోదు చేసినవారవుతారు లేక చిరు సాధిస్తే మాత్రం ప్రస్తుతం 2-1గా ఉన్న లెక్కలను 2-2గా సరిచేసినవారవుతారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

I’m Game Review: Dead Game!

BOTTOM LINE Dead Game! RATING 1.75/5 Director: Nahas Hidhayath Story, Screenplay: Nahas Hidhayath, Sajeer Baba…

2 minutes ago

Raaka Leaks: Planned or Accidental?

For a film that has been kept under wraps for so long, Raaka is suddenly…

21 minutes ago