
Madhavan's GDN, a biopic on G. D. Naidu, is releasing in Telugu despite having almost no promotional campaign.
ఒక సినిమా రిలీజ్ చేయడానికి థియేటర్లు ఉంటే సరిపోతాయా? కనీస స్థాయి ప్రమోషన్లు అవసరం లేదా? అంటే లేదనే అంటున్నారు కొందరు నిర్మాతలు.
రేపు తెలుగులో “కొరియన్ కనకరాజు, KJQ” వంటి తెలుగు సినిమాలతోపాటు “డీసీ, జీడీఎన్” అనే తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. పైన పేర్కొన్న మూడు తెలుగు సినిమాలు వాళ్ళకి కుదిరినంతలో జనాల్లోకి వెళ్లడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు.
అయితే.. డబ్బింగ్ సినిమాలైన డీసీ & జీడీఎన్ మాత్రం బేసిక్ ప్రమోషన్స్ కూడా చేయలేదు. కనీసం లోకేష్ కనగరాజ్ వల్లనో, అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ వల్లనో డీసీ అనే సినిమా ఉనికి అయినా ఆడియన్స్ కి తెలుసు. కానీ.. మాధవన్ నటించిన జీడీఎన్ అనే సినిమా వస్తున్నట్లు కూడా ప్రేక్షకులకి తెలియదు.
సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ విడుదల చేస్తున్న ఈ సినిమా విషయంలో ఎందుకింత నిరుత్సాహం అనేది అర్థం కావడం లేదు. “దురంధర్” లాంటి దిగ్గజ చిత్రం అనంతరం మాధవన్ నటించగా విడుదలవుతున్న సినిమా, అది కూడా ఒక తెలుగు వ్యక్తి జీ.డీ.నాయుడు జీవిత చరిత్ర.
అయినప్పటికీ.. ఎక్కడ పొరపాటున ప్రమోట్ చేస్తే జనాలు థియేటర్ కి వచ్చేస్తారేమో అన్నట్లుగా.. ప్రేక్షకులకు ఏమాత్రం సినిమా రిలీజ్ గురించి కానీ, సినిమా గురించి కానీ ఐడియా రాకుండా జీడీఎన్ ను విడుదల చేస్తున్న విధానం గమనార్హం.
మరి ఇంత సీక్రెట్ గా సినిమాల్ని రిలీజ్ చేయడం ఎందుకు? వాటికి బిజినెస్ ఎలా అవుతుంది? అనేది వాళ్ళకే తెలియాలి.
India's 351/7 looked like a strong enough total, but the third ODI against West Indies…
Legendary filmmaker Singeetham Srinivasa Rao has passed away at Kauvery Hospital in Chennai following ill…