
[m9ad]
కానీ తమకు నచ్చితే ప్రేక్షకులు ఎక్కడ పెట్టుకుంటారో అన్న దానికి నిదర్శనమే ఈ “గీత గోవిందం” కలెక్షన్స్ ను పేర్కొనవచ్చు. అందుకే ఈ 100 కోట్ల విజయాన్ని అందరికీ అంకితం చేసేసాడు హీరో విజయ్ దేవరకొండ. “నా మొదటి సెంచరీని నా కోచింగ్ స్టాఫ్ గీతా ఆర్ట్స్ కు, నా కెప్టెన్ బుజ్జికి, నా లవ్లీ పార్టనర్ షిప్ అయిన రష్మికకు మరియు ప్రేక్షకులకు” అంకితం ఇస్తున్నానని విజయ్ తాజాగా పోస్ట్ చేసాడు.
ప్రేక్షకులలో కూడా ప్రత్యేకించి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ప్రేక్షకులను ఉదహరిస్తూ విజయ్ పేర్కొన్నాడు. “గీత గోవిందం” సాధించిన అపూర్వమైన విజయాన్ని పురస్కరించుకుని, ప్రస్తుతం విదేశాల్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు విజయ్. అక్కడ ఉన్నా సినిమా సాధిస్తోన్న కలెక్షన్స్ పై ఆరా తీస్తున్నారని ఈ పోస్ట్ తో చెప్పకనే చెప్పాడు ఈ ‘సూపర్ పవర్ స్టార్.’
The advance booking trend on BookMyShow offers an indication of the buzz surrounding a film…
Bhuvneshwar Kumar is back in the Indian T20I team after four years, but his first…