
[m9ad]
కానీ ప్రస్తుతం సినిమా విడుదలైపోయింది, డబుల్ బ్లాక్ బస్టర్ అయిపోయింది… ప్రేక్షకులు ఇచ్చిన తీర్పుకు చిత్ర యూనిట్ మొత్తం ఫుల్ ఖుషీ అయిపోయిన నేపధ్యంలో… తాజాగా నాడు లీకైన ఫుల్ సినిమా నేడు ప్రత్యక్షం అయ్యింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ చెప్పినట్లుగా…. ఇది డబ్బింగ్ అండ్ రీ రికార్డింగ్ కు ముందు ప్రివ్యూ షో కోసం తయారు చేసినదిగా స్పష్టమైంది. నాడు విజయ్ ‘డబ్బింగ్, రీ రికార్డింగ్ లేకుండా సినిమాను ఎలా చూస్తారురాబై’ అన్న విషయం తెలిసిందే.
ఇక్కడ చర్చనీయాంశం అయిన సంగతి ఏమిటంటే… కేసుల రీత్యా నాడు భయపడి ఈ పైరసీ ప్రింట్ బయటకు రాలేదు గానీ, బహుశా ఇది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటే సినిమాకు నిజంగానే డ్యామేజ్ జరిగి ఉండేది. అంటే పైరసీకి గురికాబడింది కొన్ని సన్నివేశాలు కావు, సినిమా మొత్తం అన్న విషయం స్పష్టమైంది. ఇదే కోవలో విజయ్ దేవరకొండ “టాక్సీవాలా” కూడా ఉందన్న ప్రచారం నాడు జరిగిన విషయం తెలిసిందే.
The Telangana government has carried out a major reshuffle of senior IAS officers. The changes…
ఉండవల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో కూటమి అధినేతల సంయుక్త సమావేశంలో జనసేన అధినేత, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ చెప్పిన…