Telugu

ఇతను రవితేజ… కానీ మాస్ మహారాజా కాదు..!

టాలీవుడ్ లో రవితేజ పేరు చెప్పగానే ‘మాస్ మహారాజా’ అని గుర్తుకు రావడం సహజం. అంతలా తన సినీ ప్రస్థానాన్ని ప్రేక్షకుల మదిలో చొచ్చుకుపోయేలా చేసాడు రవితేజ. స్వయంకృషితో రవితేజ ఎదిగిన వైనం స్ఫూర్తిదాయకంగా నిలువగా, తాజాగా ఇదే పేరుతో మరో హీరో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతున్నాడు. ఇతని పేరు రవితేజనే… కానీ, మాస్ మాహారాజా మాత్రం కాదు. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ నుండి వస్తున్న ఈ రవితేజ ఉగాది రోజున తన తొలి చిత్రాన్ని ప్రారంభించారు.

ADVERTISEMENT

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అల్లుడు అయిన రవితేజ టాలీవుడ్ లో అరంగేట్రం చేయనున్న సినిమా పేరును ‘జయదేవ్’ అని నిర్ణయించినట్టు దర్శకుడు జయంత్ సీ పరాన్జీ తెలిపారు. ఉగాది సందర్భంగా తమ సినిమాకు ‘జయదేవ్’ అనే పేరును ఖరారు చేశామని అధికారికంగా వెల్లడించారు. చివరగా పవన్ తో ‘తీన్ మార్’ తీసిన జయంత్, చాలాకాలం తర్వాత ఓ తెలుగు సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.

కర్తవ్య నిర్వహణ కోసం కుటుంబాన్ని, జీవితాన్ని త్యాగం చేసిన పోలీసుల జీవితాల ఆధారంగా తయారు చేసిన అద్భుత కథ ఇదని, ఈ సినిమాలో సుమారు పది యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని జయంత్ స్పష్టం చేసారు. రవి నటన అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ గా మాళవిక నటిస్తుండగా ఈ సినిమాలో ఇతర పాత్రలలో వినోద్ కుమార్, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని, వెన్నెల కిషోర్‌, హరితేజ, శ్రావణ్‌, సుప్రీత్‌ వంటి కీలక నటులు కనిపించనున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Kaaka Out of Sankranthi? Big Release Buzz Around Chiru

There is some fresh buzz around Chiranjeevi and Bobby Kolli’s Kaaka. According to industry gossip,…

17 minutes ago

ఇంత అయోమయం దేనికి రాజా?

రాహుల్‌ గాంధీ ఏ ముహూర్తాన్న ‘క్రెడిట్ చోరీ’ అనే పదం కనిపెట్టారో కానీ, ఇప్పుడు దానిని దేశంలో ప్రతీ పార్టీ,…

25 minutes ago