
అగ్రరాజ్య అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన నాటి నుంచి అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో రోజుకో అనిచ్చితి. కొన్నాళ్లు టారీఫ్ల ప్రకటనతో మార్కెట్లను భయపెట్టిన ట్రంప్ మరికొన్నాళ్లు టారీఫ్ల మోతతో మార్కెట్లను ఉక్కిరిబిక్కిరి చేసారు.
ఇక అటు పిమ్మట ఇతర దేశాధిపతుల పై అగ్రరాజ్య అధ్యక్షుడి దుందుడుకు చర్యలు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధురోను బంధించడం, ఇప్పుడు ఇరాన్ దేశాధ్యక్షుడు అలీ ఖమేనీ ని హతమొందిచడం ఇలా ట్రంప్ చర్యలు ఒక్కొక్కటి అంతర్జాతీయ మార్కెట్లను భయాందోళనకు గురి చేస్తున్నాయి.
ఒక పక్క ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలలో వేలు పెట్టి శాంతి శాంతి అంటూ శాంతి సందేశాలిస్తూనే మరోపక్క తన దేశ ఆధిపత్యాన్ని చూపించుకోవడానికే ఇలా ఇతర దేశాల మీద యుద్ధాలతో విరుచుకుపడడం ట్రంప్ రాజకీయంలో భాగంగా మారిపోతుంది.
తానూ అధికారంలోకి వచ్చిన ఏడాదికే ఎన్నో దేశాల మధ్య యుద్దాలు ఆపి, ఆ దేశ ప్రజల ప్రాణాలు కాపాడాను, అందుకు గాను తనకు నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందే అంటూ నోబెల్ బహుమతి కోసం అరువులు చాచిన ఈ శాంతి కాముకుడు ఇప్పుడు ఇరాన్ పై చేస్తుందేంటి అంటూ ఇరాన్ ప్రజలు గొంతెత్తుతున్నారు.
రోజుకో ప్రకటన, రోజుకో వివాదం తో నిత్యం దేశీయ స్టాక్ మార్కెట్లను భయపెడుతున్న ట్రంప్ ప్రకటనలు మార్కెట్లలో బ్లడ్ బాత్ లకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా ఇప్పుడిప్పుడే బలపడుతున్న భారత్ వంటి దేశాలకు ఈ నిరంతర బ్లడ్ బాత్ లు దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనికి సూచికగా మారుతుంది.
గత శుక్రవారం మార్కెట్ల ముగింపు సమయానికి ఒక్కసారి పడిపోయిన సూచీలు నేడు ఇరాన్ – ఇజ్రాయిల్, అమెరికా సంయుక్త యుద్ధ చర్యలతో సుమారు 500 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ గత వారాంతం క్లోసింగ్ 25178 కాగా నేడు 24650 మీద ఓపెన్ అయ్యి ప్రస్తుతం 500 పాంట్లు నష్టంతో 246775 వద్ద ట్రేడ్ అవుతుంది.
అలాగే సెన్సెక్స్ 1600 నష్టంతో 79677 పాయింట్లతో ఇన్వెస్టర్లకు నష్టాలను మిగులుస్తుంది. ఈ ఒక్క రోజు దాదాపు 8 లక్షల కోట్ల సంపద ఆవిరైనట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇటువంటి సమయంలో ఇన్వెస్టర్ల ఫోర్ట్ పోలియో లు ఎర్ర సముద్రం మాదిరి ఎరుపుక్కుతున్నాయి.
అటు ఇదే సమయంలో క్రూడ్ ఆయిల్ ధరలకు రెక్కలొచ్చి అంతర్జాతీయంగా క్రూడ్ 80 డాలర్ లకు పైనే ట్రేడ్ అవుతుంది. అలాగే ఇటు వెండి, బంగారం రేట్లకు కూడా రెక్కలొచ్చాయి. ఇలాగే ఈ అనిచ్చితి ఇంకొంత కాలం కొనసాగితే ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభం దిశగా అడుగులేయాల్సి వస్తుందంటున్నారు ట్రేడ్ వర్గాలు.
మరి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఈ ట్రంప్ ముంపు ఇంకెంతకాలం కొనసాగుతుందో.? అగ్రరాజ్య అధ్యక్షుడిగా ట్రంప్ ఇంకెంతకాలం ప్రపంచదేశాలను తన చర్యలతో బయపెడతారో చూడాలి..!
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…