
అలాగే ఆభరణాల డిమాండ్ కూడా పడిపోయిందని గత ఏడాది 514 టన్నులుగా నమోదైందని తెలిపింది. ఈ డిమాండ్ శాతం 2015 కంటే 22.4 శాతం తక్కువని పేర్కొంది. 2015లో ఆభరణాల డిమాండ్ 662.3 టన్నులుగా ఉందని ఈ సందర్భంగా తెలిపింది. ప్రస్తుతం ఆభరణాల పరిశ్రమ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పింది. అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు గోల్డ్ ఇండస్ట్రీలో పారదర్శకతను కూడా తీసుకొస్తాయని పేర్కొంది.
పెద్ద నోట్ల రద్దు తరువాత ఏర్పడిన నగదు కొరత ప్రభావం గ్రామీణ ప్రాంతాన్ని అధికంగా దెబ్బతీసిందని, అయితే, ఆ ప్రభావం తాత్కాలికమేనని తెలిపింది. ఈ ఏడాది బంగారం డిమాండ్ 650-750 టన్నుల వరకు ఉంటుందని భావిస్తోంది. అయితే బంగారం కలిగి ఉండడంపై మోడీ సర్కార్ పలు నిబంధనలను అమలు చేస్తుందన్న ప్రచారం నేపధ్యంలో ఈ ఏడాది కూడా పతనమయ్యే సూచనలే ఎక్కువగా కనపడుతున్నాయి.
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…