
ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సదస్సు జరుగగా, పనులు పర్యవేక్షిస్తున్న పలు విభాగాల ప్రతినిధులు హాజరై గ్రిడ్ పనులు ఎంతవరకూ వచ్చాయన్న విషయమై చర్చించారు. గ్రిడ్ నిర్మాణం పూర్తయ్యాక, గ్రామస్థాయిలో సేవలందించే ఎంఎస్ఓలు, కేబుల్ ఆపరేటర్లను భాగం చేస్తామని తెలిపారు. ఇప్పటివరకూ 4,500 కి.మీ పొడవైన ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ నిర్మాణం పూర్తయిందని, మరో 19,500 కి.మీ నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి వుందని ఏపీ ఫైబర్నెట్ లిమిటెడ్ సీఈఓ కోగంటి సాంబశివరావు తెలిపారు.
గ్రిడ్ ద్వారా టెలిఫోన్ సేవలు అందుకుంటే ఔట్ గోయింగ్ చార్జీలుండవని, ప్రత్యేక చెల్లింపులతో కొత్త చిత్రాలను ఇంట్లో నుంచే వీక్షించవచ్చని తెలిపారు. గ్రిడ్ కు సహకరించేందుకు మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్ బుక్ తదితర ఐటీ కంపెనీలు హామీ ఇచ్చాయని వివరించారు. సెట్ టాప్ బాక్స్ కొనుగోలు చేసిన వారు 1,500 చెల్లించి, బాక్స్ లేనివారు 2,500 చెల్లించి ఈ సేవలను అందుకోవచ్చని పేర్కొన్నారు.
Chennai Super Kings have made a four player trade with Sunrisers Hyderabad ahead of IPL…
Mahakali starring Bhumi Shetty, Akshaye Khanna, Sriya Reddy and Khushbu Sundar in leading roles has…