
నాగార్జున సాగర్ పూర్తి సామర్ధ్యం 312 టీఎంసీలు. ఈ వారాంతానికి నిండవచ్చని అధికారుల అంచనా. దీనితో ఈ సంవత్సరం తాగు నీటికి, సాగు నీటికి కొరత ఉండదు అన్నట్టే. ఎన్నికలకు ఒక ఏడాది ముందు ఈ పరిస్తితి ఉండటం రెండు రాష్ట్రల ముఖ్యమంత్రులకు కలిసి వచ్చేదే.
గత రెండేళ్లగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తాగునీటి కోసం కొట్టుకోవడం చూశాం. ప్రాజెక్టుల వద్ద పోలీసులని కూడా మోహరించాల్సి వచ్చింది. పెద్ద దిక్కుగా వ్యవహరించాల్సిన కేంద్రం కూడా చేతులు ఎత్తేసింది. మొత్తానికి ఈ సమస్య తీరనుంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాల తో పాటు రెండు రాష్ట్రాల రైతాంగానికి కూడా ఇది శుభవార్తె.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…