యువరాజ్ సింగ్ ఫ్యాన్స్ అందరికీ శుభవార్త!

క్రికెట్ ను ఇష్టపడే వారంతా దాదాపుగా యువరాజ్ సింగ్ బ్యాటింగ్ ను అమితంగా ప్రేమిస్తారు. అభిమానులంతా ముద్దుగా పిలుచుకునే యువీ షాట్లు అలా ఉంటాయి మరి. అయితే రీ ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి సరైన అవకాశాలు లభించక, వచ్చిన ఒకటి, రెండు సమయాలలో రాణించక, మళ్ళీ జట్టులో స్థానం కోల్పోతాడేమోనని ఆందోళన అభిమానుల నుండి వ్యక్తమైంది.

అయితే ఇక దానికి ఆస్కారం లేకుండా తన మునుపటి వైభవాన్ని ప్రదర్శిస్తున్నాడు యువీ. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన యువీ, గురువారం యూఏఈ మ్యాచ్ లోనూ అదే స్థాయిలో రాణించి అభిమానులను అలరించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో యూఏఈ జట్టు పసికూనే అయినప్పటికీ, ఆ జట్టు మీద కూడా రాణించాల్సిన అవసరం ఉంది. లేదంటే కనీసం ఈ జట్టుతో కూడా రాణించలేకపోయాడన్న విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. యువీ (14 బంతుల్లో 25) ధాటికి 81 పరుగుల లక్ష్యం కేవలం 10.1 బంతుల్లోనే టీమిండియా చేధించి, భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.

ADVERTISEMENT

అయితే యువీ ప్రదర్శించిన ఆట తీరుతో అభిమానులే కాదు, విమర్శలే కూడా సంబర పడుతున్నారు. ముఖ్యంగా యువరాజ్ సింగ్ మునుపటి మాదిరి అద్భుతమైన షాట్లు కొడుతుండడం టీమిండియాకు బాగా లాభించే అంశం. ఇక, యువీ గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు, ఇదే రీతిన ప్రదర్శన ఇస్తే వన్డే జట్టులోనూ యువీ స్థానం ఖరారు అవుతుంది. అభిమానులంతా కూడా ఆ సమయం కోసమే వేచిచూసేది కూడా!

Share
Saumya

Saumya is a passionate Telugu movie addict and an avid binge watcher of OTT platforms, covering Travel, Bollywood, Tamil, Kannada, Malayalam, and international cinema. With a decade of experience at M9 News, Saumya br…

Published by

Recent Posts

Sai Dharam Tej Engaged To Kiran, First Picture Out

Sai Dharam Tej, also known as Sai Durgha Tej, got engaged to his girlfriend Kiran…

18 minutes ago

Will OTT Offer Some Relief to Dulquer Salmaan’s Flop?

Dulquer Salmaan's high budget fantasy action film I'm Game directed by Nahas Hidhayath, was released…

38 minutes ago