
గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఒక సినిమా ఆ మధ్య మొదలయ్యింది. మొన్న ఆ మధ్య ఇటలీ లో ఒక షెడ్యుల్ జరుపుకుంది. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ టాలీవుడ్ లో టాక్ అయ్యింది.
అసలు విషయం ఏమిటంటే… వేణు దొనేపుడి అని అశ్విని దత్ గారి బంధువు ఈ సినిమా తో నిర్మాతగా పరిచయం అవుతున్నారు. టర్మ్స్ ఎంటో తెలీదుగానీ ఈ సినిమాలో షైన్ స్క్రీన్స్ లో పార్టనర్ గా ఉన్న హరీష్ పెద్ది కూడా ఈ సినిమా తెరవెనుక ఉన్నారట.
అయితే ఇటలీ లో షెడ్యుల్ జరుగుతున్నప్పుడే డబ్బు సర్దుబాటు కు ఇబ్బంది పడ్డారట నిర్మాత. అయితే హీరో దగ్గర పంచాయతీ పెడితే అక్కడ ఏం జరిగిందో గానీ హరీష్ పెద్ది సినిమా ని టేక్ ఓవర్ చేస్తా అని మాట ఇచ్చి… ఒక కొత్త బ్యానర్ మొదలు పెట్టి వర్క్ స్టార్ట్ చేశాడట.
అయితే అసలు నిర్మాత వేణు అలా ఎలా కుదురుతుంది అంటూ హరీష్ పెద్ది కి ఒక లీగల్ నోటీసు పంపారట. ఇక చేసేది ఏమీ లేక శ్రీను వైట్ల ఇన్వాల్వ్ అయ్యి వేణు కూడా సినిమాలో ఉండేలా సర్ధి చెప్పారట. మొత్తానికి సినిమా గోవా లో ఇంకో షెడ్యుల్ మొదలయ్యింది.
ఇండస్ట్రీలో హరీష్ కి, సాహు కి గ్యాప్ వచ్చిందని, హరీష్ కి తెలీకుండా సాహు బిజినెస్ చెయ్యడం తో హరీష్ అప్ సెట్ అయ్యాడని, లెక్కల్లో తేడా వచ్చింది ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే మొదటి నుండీ సాహు నే సినిమాల బిజినెస్ చేస్తాడని, రిస్క్ కూడా ఆయన దే అని అసలు అది మేటర్ కాదని తెలుస్తుంది.
సాహు ఇండస్ట్రీ లో మంచి గుడ్ విల్ తో సినిమా సినిమా కి ఎదుగుతూ ముందుకు వెళ్తున్నాడు. ఈ సమయంలో హరీష్ బయటకు వెళ్లడం వల్ల అనవసరమైన రూమర్స్ వల్ల సాహు కొంత చికాకు పడాల్సి వచ్చినా హరీష్ బయటకు వెళ్లడం ఆయనకే రిస్క్ అని ఇండస్ట్రీ లో టాక్.
BOTTOM LINE Second Half Drowns RATING 2/5 Story, Screenplay, Director: Mathimaran Pugazhendhi Cast: Soori, Suhas,…
Car gifts after a hit have almost become a familiar part of South Indian cinema…