Telugu

మీ అధినేతకు భయాన్ని పరిచయం చేయండి: టిడిపి

నేడు ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో ఏడు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలలో ఒక స్థానానికి టిడిపి కూడా పంచుమర్తి అనురాధను అభ్యర్ధిగా బరిలో దింపి వైసీపీకి సవాల్ విసురుతోంది. ఈ సందర్భంగా టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడుతూ, “పట్టభద్ర ఎన్నికలలో మూడు ఎమ్మెల్సీ సీట్లను టిడిపి గెలుచుకొని పార్టీ కార్యకర్తలలో నూతనోత్సాహం నింపింది. ఈ ఫలితాలు రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకొంటున్నాయని స్పష్టం చేశాయి. టిడిపి మాత్రమే రాష్ట్ర ప్రజల భవిష్యత్‌కు భరోసా కల్పిస్తుందని ప్రజలు నమ్ముతున్నారని అర్దం అవుతోంది. కనుక ఈరోజు జరుగుతున్న ఈ ఎన్నికలలో కూడా టిడిపి విజయం సాధించడం ఖాయం.

ADVERTISEMENT

వైసీపీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 16 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. వైసీపీలో ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు తమ ప్రభుత్వం పట్ల ప్రజలలో తీవ్ర అసంతృప్తి ఉందనే విషయం గుర్తించారు. వైసీపీని ఓ మునిగిపోతున్న నావగా భావిస్తున్నారు. కనుక దానిలో ఉండే కంటే సమయం చూసుకొని బయటపడటం మంచిదని భావిస్తున్నారు.

వైసీపీలో అవమానాలు భరిస్తూ దానిలోనే కొనసాగాలనుకొనేవారు కొందరున్నారు. తమను అధినేత మళ్ళీ పిలిచి గౌరవించాలంటే ఈ ఎన్నికలలో చిన్న జర్క్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. వైసీపీలో అటువంటివారు ఆత్మ ప్రభోదం ప్రకారం ఈ ఎన్నికలలో మా పార్టీకి ఓట్లేస్తారని భావిస్తున్నాము,” అని అన్నారు.

“రాష్ట్ర ప్రజలందరూ మా వెంటే ఉన్నారని, వైనాట్ 175 సీట్స్?” అని గొప్పగా చెప్పుకొంటున్న వైసీపీ అధినేత, ఈరోజు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు క్యాంప్ రాజకీయాలు ఎందుకు నిర్వహిస్తున్నారని టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నిస్తున్నారు. ప్రజల సంగతి దేవుడెరుగు… కనీసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెంట ఉన్నారో లేదో అని సిఎం జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారని, అందుకే క్యాంప్ రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కానీ ఈ ఎన్నికలలో కూడా టిడిపి తప్పక గెలుస్తుందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధీమా వ్యక్తం చేశారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Bigg Boss Telugu: Thrigun’s Toxic Manipulative Game

Bigg Boss Telugu Season 10 gameplay has reached an entirely new level. Everything was good…

30 minutes ago

టీడీపి-జనసేన ఐఖ్యతను పునర్నిర్వచించుకోక తప్పదా?

మున్సిపల్ ఎన్నికలలో సీట్ల కేటాయింపుపై టీడీపి, జనసేన రెండు పార్టీలలో తిరుగుబాట్లు కూటమి ఐఖ్యతని, మనుగడని ప్రశ్నిస్తున్నట్లే ఉన్నాయి. టీడీపి…

30 minutes ago