Telugu

పన్నులకు తగిన పనులు జరుగుతున్నాయా?

మన దేశంలో పన్నులు కట్టాలంటే బడాబాబులకే కాదు, సామాన్య ప్రజానీకానికి కూడా మనసు రాదు. ఎందుకంటే చెల్లించిన పన్నులకు తగ్గ ప్రతిఫలం మనం తిరిగి ప్రభుత్వాల నుండి పొందలేకపోవడమే. ప్రతి భారతీయ పౌరుడు పన్నుల రూపంలో చెల్లిస్తున్న పైకాన్ని దేశ అభివృద్ధికే వినియోగిస్తారన్న నమ్మకాన్ని ఇప్పటివరకు ఏ ప్రభుత్వం మన ప్రజానీకానికి కల్పించలేకపోయిందన్నది విశ్లేషకుల వాదన.

బ్రిటిష్ వారి కాలంలో మన జాతి సంపదంతా వారే దోచికేల్లారని మనo ఇప్పటికి మాట్లాడుకుంటున్నాం. బ్రిటిష్ వారి పాలన వలనే మన దేశానికి ఈ పరిస్థితి వచ్చిందని లేకపోతే, మన భారతదేశం కూడా అమెరికా లాంటి సంపన్న దేశంగా మారి ఉండేదని మన రాజకీయ నాయకులు చెప్పే కాకమ్మ కధలకు కొదవలేదు. కానీ, వాస్తవంగా మన దేశ సంపద ఇప్పుడు ఎవరు దోచుకుంటున్నారో అందరికి తెలిసిన విషయమే. కానీ ఈ నిజాన్ని ఒప్పుకోవడానికి ఏ రాజకీయ నాయకుడు ఏ ప్రభుత్వ అధికారి సిద్ధంగా ఉండరు.

ADVERTISEMENT

బ్రిటిష్ వారు మన దేశంలో సంపదను దోచుకొని తీసుకువెళ్ళి వారి దేశాన్ని అభివృద్ధి చేసుకొన్నారు. వారి దోపిడిలో దేశ స్వార్ధం ఉంది, కానీ మన వారి దోపిడిలో వ్యక్తిగత స్వార్ధం మాత్రమే ఉంటుంది. మరి ఎవరి దోపిడీ వలన మన దేశానికి నష్టం కలుగుతుందో ఈ ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి. మనం కొనుక్కునే ప్రతి వస్తువు మీద కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తెలిసో తెలియకో కొంత మొత్తాన్ని పన్నుల రూపంలో చెల్లిస్తూనే ఉన్నాం. కానీ, వాటిని ఏ మేరకు ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి అంటే తెల్లముఖం వేయాల్సిందే. ప్రతి చిన్న అంశం దేశ ప్రజలకు లెక్క చెప్పనవసరం లేదు గానీ, అది అభివృద్ధి ద్వారా ప్రతిబింభిస్తే ప్రజలకు అర్ధమవుతుంది.

ఎన్ని తరాల నుండి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే చదువుకుంటున్నాము అంటే… కారణం రాజకీయ నాయకులలో చిత్తశుద్ధి లేకపోవడమే. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకొంటున్న ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ప్రజా సమస్యలపై మాత్రం దృష్టి పెట్టరు. ఇప్పటికి రహదారులు కూడా లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. మరోవైపు రాజభోగాలు అనుభవిస్తున్న రాజకీయ నాయకులు ఎందరో ఎందరెందరో..! ఈ ప్రజాధనం ఏమవుతుంది అన్నది అందరికి తెలిసిన బహిరంగ సత్యమే. అభివృద్దిని చూపి పన్ను అడిగితే ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ప్రభుత్వాలకు సహకరిస్తారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ్ వంటి వారే పన్నులకు తగ్గ పనులు మనకు జరగడం లేదు అని బహిరంగంగానే విమర్శించిన విషయం తెలిసిందే. వాస్తవానికి దగ్గరగా ఆలోచించే ఇటువంటి నాయకులే ఇప్పుడు మన దేశానికి అవసరం. పన్నుల శాతం తగ్గిస్తే అప్పుడు ప్రజలు కూడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వాలకు సహకరిస్తారు. పన్నులు చెల్లించేది ఒకరు పెత్తనం చేసేది మరొకరు. ఈ ఆలోచన ప్రభుత్వాలలో మారాలి, అలాగే ప్రభుత్వాలకు చెల్లించే పన్నులు ఎగవేసే దొరని ప్రజలలో మారాలని ఆశిద్దాం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

It’s Clear: Kavitha’s Target Locked For Election!

Kalvakuntla Kavitha had an emotional exit from the BRS party as she was sent out…

57 minutes ago

Varun Gets Trolled Brutally Again: Tax Saving Tactics?

Varun Dhawan’s films have not worked big at the box office over the last few…

1 hour ago