
అయితే వైసీపీ నుంచి తనకు ఎలాంటి సస్పెన్షన్ ఉత్తర్వులు అందలేదన్నారు గౌతమ్ రెడ్డి. సెంట్రల్ సీటు వంగవీటి రాధాకే అని జగన్ చెప్పారని… వంగవీటి రాధాతో కలిసి పనిచేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. రాధ, రంగాపై తన వ్యాఖ్యలు ముగిసిన అధ్యాయమని గౌతంరెడ్డి పేర్కొన్నారు.
ఇటీవలే ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న జగన్‌ను గౌతంరెడ్డి కలిసిన విషయం తెలిసిందే. ఆయనతో కలిసి నడుస్తున్న మాట్లాడుతున్న ఫోటోలు అన్ని మీడియాలలోను ప్రముఖంగా వచ్చాయి. అయితే ఈ ఉదంతం తరువాత ఇప్పటిదాకా వంగవీటి రాధా స్పందించలేదు. జగన్ చేసిందంతా కాపులను మాయ చెయ్యడానికి చేసిన డ్రామానా? అని టీడీపీ వారు విమర్శిస్తున్నారు.
Balakrishna’s NBK111 is heading towards a crucial phase. The film has already locked December 24…
Pawan Kalyan’s birthday is almost here, and OG 2 is naturally one of the projects…