Telugu

చిన్నమ్మ అప్పుల గురించి మరిదిని అడగలేదేమి?

ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల లెక్కలు వివరించి, వీటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని లేకుంటే కేంద్ర సంస్థల చేత దర్యాప్తు చేయిస్తానని హెచ్చరించారు. దీనిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ నేడు విశాఖపట్నంలో స్పందించారు.

ADVERTISEMENT

జీవీఎంసీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ, “మేమేమీ కేంద్రానికి, రిజర్వ్ బ్యాంకులు తెలియకుండా రహస్యంగా అప్పులు తీసుకురాలేదు. వాటిని ఎక్కడా దుబారా చేయలేదు. తెచ్చిన ప్రతీ రూపాయిని సంక్షేమ పధకాలు, అభివృద్ధి కోసమే ఖర్చు చేశాము. ప్రతీ పైసాకు మా వద్ద లెక్కలున్నాయి. ఇప్పుడు మా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న చిన్నమ్మ (దగ్గుబాటి పురందేశ్వరి) ఆనాడు తన మరిది (చంద్రబాబు నాయుడు) చేసిన అప్పుల గురించి ఎందుకు అడగలేదు?

ఆయన చేసిన అప్పులకు, ఖర్చులకు ఓ లెక్కాపక్కా ఉండేది కాదు. అప్పుడు ఆయనను ప్రశ్నించలేకపోయిన చిన్నమ్మ ఇప్పుడు మా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఏమిటి?ఒకవేళ మేము విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఎందుకు వారించలేదు? వారించలేదంటే అర్దం మేము ఆర్ధిక క్రమశిక్షణతో ఉన్నట్లే కదా?

కనుక ఇప్పుడు చిన్నమ్మ రాష్ట్ర అప్పుల గురించి మాట్లాడటం రాజకీయమే కదా? చిన్నమ్మ ఏపీ బిజెపి అధ్యక్షురాలుగా బాధ్యతలు చెప్పట్టారు కనుక మా ప్రభుత్వాన్ని ఏదో ఒకటి అనాలి కనుక నోటికి వచ్చిన్నట్లు మాట్లాడటం సరికాదు?” అని ఘాటుగా బదులిచ్చారు.

కేంద్ర ప్రభుత్వమే స్వయంగా జగన్ ప్రభుత్వానికి అడిగినప్పుడల్లా అడిగినంతా అప్పులు ఇప్పించింది. ఇందుకు ఓ చిన్న ఉదాహరణ విద్యుత్‌ సంస్కరణల పేరుతో వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగిస్తే మరికొంత అప్పు చేసుకొనేందుకు అనుమతించింది. కనుక నాలుగేళ్ళు అప్పులు ఇప్పించి ఎన్నికల దగ్గరపడుతున్న ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిద్వారా నిలదీయడం రాజకీయమే కదా?దీనికి ఆమె ఏమి సమాధానం చెపుతారో?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Nagarjuna’s Indirect Dig at Aadarsha Kutumbam?

Nagarjuna has raised an important point about the release problems faced by smaller films like…

11 minutes ago

Reality: Devika Bhat’s First Look as Aalochana

Kiran Abbavaram, who has acted in several successful films, is making his directorial debut with…

27 minutes ago