
మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి శనివారం విశాఖపట్నంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ‘ఈనాడు’ పత్రిక సమాజానికి, రాష్ట్రానికి చాలా హానికరంగా మారిందని చెప్పడం చూస్తే, ఈనాడుపై వేటు వేసేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్దమవుతున్నట్లనిపించక మానదు. టిడిపి, చంద్రబాబు నాయుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియాలపై సాక్షిలో విమర్శలు, ఆరోపణలతో కధనాలు ప్రచురిస్తే తప్పు కానప్పుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలలో వైసీపీ ప్రభుత్వ విధానాలని, లోపాలని, తప్పులని ఎత్తిచూపుతూ వ్రాయడం ఎలా తప్పవుతుంది?
అయినా వైసీపీకి డప్పు కొట్టుకొనేందుకు, దాని రాజకీయ ప్రత్యర్ధులని చీల్చిచెండాడేందుకే కదా సాక్షి మీడియాని ఏర్పాటు చేసుకొంది? మరి అదేపని ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలు చేస్తే తప్పెలా అవుతుంది?ఈనాడు సమాజానికి హానికరమైతే ప్రజలు ఏనాడో దానిని తిరస్కరించి ఉండేవారు కానీ నేటికీ రాష్ట్రంలో నెంబర్: 1 స్థానంలో నిలిచి ఉంది కదా?
సాక్షి మీడియాని బ్రతికించుకొనేందుకు వాలంటీర్లకు నెలకి రూ.200 చొప్పున సాక్షి పేపర్ కొనుగోలు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం చెల్లిస్తోంది. వందల కోట్ల ప్రచార ప్రకటనలు ఇస్తోంది. అయినా ఈనాడు, ఆంధ్రజ్యోతి ఆత్మసాక్షిని సవాలు చేస్తూ నిలబడే ఉన్నాయి. కనుక ఈనాడుపై ‘సమాజానికి హానికరం’ అనే ముద్ర వేసి మూయించేసి సాక్షికి తోడ్పడాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోందేమో? వైసీపీ మనసులో ఏముందో త్వరలోనే తెలియవచ్చు.
Festival releases are usually a dream for film producers for better openings and a chance…
Yashasvi Jaiswal has started working on wicketkeeping ahead of the 2026-27 Ranji Trophy season, but…