దర్శకుడు గుణశేఖర్ భార్య కారు సృష్టించిన బీభత్సం!

Gunasekhar wifeసల్మాన్ ఖాన్ ‘హిట్ అండ్ రన్’ కేసుకు ఇటీవలే శుభం కార్డు పడిన విషయం తెలిసిందే. ప్రాణాపాయం లేకపోయినా కొన్ని సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరిగిన సల్మాన్ కు ఈ ఏడాది ఊరట లభించింది. అంతలా హిట్ అండ్ రన్ కేసు సల్మాన్ ను వెంటాడింది. అయితే ఇదే తరహాలో తెలుగు సినిమా దర్శకుడు గుణశేఖర్ భార్య కారు కూడా హైదరాబాద్ బీభత్సం చేసిందన్న వార్తలు అందుతున్నాయి.

హైదరాబాద్ లోని మాదాపూర్ లో గుణశేఖర్ భార్య రాగిణి కారు సృష్టించిన బీభత్సానికి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే ప్రాణాపాయం ఏమీ సంభవించలేదని తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన మరింత సమాచారం వివరాలు తెలియాల్పి ఉంది. ‘రుద్రమదేవి’ సినిమాను తన భార్య ‘రాగిణి’ సమర్పణలోనే గుణశేఖర్ విడుదల విషయం తెలిసిందే.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories