
ఏదో టిడిపి ఆడించిన మైండ్ గేమ్ అని కొందరు వైసీపీ నేతలు చాలా తేలికగా తీసుకున్నారు. రాజకీయాల్లో ఇలాంటి ఆటలన్నీ సహజం కాబట్టి వీటికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే వైసీపీ నేతలు ఇక్కడితో ఆగిపోతే, తమ ప్రభావం ఉండదనుకున్నారో ఏమో గానీ, గుంటూరు జిల్లా వైకాపా ఎమ్మెల్యేలు రామకృష్ణారెడ్డి, ముస్తఫా, కోన రఘుపతి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు మీడియాలో మాట్లాడుతూ… ఒక అద్భుతమైన హాస్యాస్పద ప్రకటన చేసారు. ఈ ప్రకటన విన్న తర్వాత ‘ఆశ్చర్యంతో కూడిన హాస్యం’ రావడం సహజమే మరి!
“తెలుగుదేశం పార్టీ నేతలు మాతో టచ్ లో ఉన్నారని, ఏ క్షణమైనా వారంతా వైసీపీలోకి రావచ్చని, తెలుగుదేశం మునిగిపోయే నావ అని, ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరిపారని” తెలుగుదేశం పార్టీకి కౌంటర్ ఇచ్చే పనిలో “జోకులు” వేసారని నెటిజన్లు నవ్వుకుంటున్నారు. రాజకీయంగా ఎన్ని విమర్శలు అయినా చేసుకోవచ్చు గానీ, అధికారం చేతిలో ఉంచుకుని రాజకీయ నేతలు ప్రతిపక్షంలోకి వెళ్ళాలని చెప్పడం హాస్యాస్పదం కాక ఇంకేంటి..? అంటున్నారు. నిజానికి అలాంటి అరుదైన సంఘటనలు ఏ నూటికో, కోటికో జరుగుతుంటాయి. ప్రస్తుతం వైసీపీ ఉన్న పరిస్థితులలో అయితే జరిగే అవకాశం లేదని అందరికీ తెలిసిందే.
టిడిపి మైండ్ గేమ్ ఆడుతోందని ప్రస్తావించిన వైసీపీ నేతలు, దాన్ని పునరావృతం చేయాలని పడే తాపత్రయంలో భాగంగానే ఇలాంటి ప్రకటనలు వచ్చాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు ‘మైండ్’ గేమ్ ఆడుతున్నట్టే ఉన్నాయా? లేక ఇలాంటి వారు పార్టీలో ఉంటే ప్రత్యర్ధులు ‘మైండ్’ గేమ్ ఆడుతూనే ఉంటారని భావించాలా? ఇప్పటికీ విజ్ఞులకు అర్ధమై ఉంటుంది..!
తెలంగాణ రాజకీయాలలో రేవంత్ vs కల్వకుంట్ల మధ్య మైండ్ గేమ్ పాలటిక్స్ నడుస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పై బురద జల్లేందుకు…
అవును! నిజమే! జగన్ ఒక్క వార్నింగ్ ఇచ్చేసరికి సిఎం చంద్రబాబు నాయుడు హడావుడిగా రాష్ట్రంలో కరువు మండలాలు ప్రకటించేందుకు సిద్దమయ్యారట!…