
పాస్టర్లు వందల కోట్లు తెచ్చి మతమార్పిడులు చేస్తున్నారని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పేరుతో తమపై నిందలు వేస్తారా అని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారన్నారు. కేంద్రం నిర్ణయం తీసుకోనప్పుడు ఆందోళనలు సరికాదని ఎంపీ జీవీఎల్ తెలిపారు. అయితే దీనిపై సోషల్ మీడియా లో అధికారపార్టీ మద్దతుదారులు పెద్దఎత్తున విరుచుకుపడుతున్నారు.
“స్టీల్ ప్లాంట్ విషయం బడ్జెట్ లో ప్రస్తావించారు… ఆ తరువాత మంత్రిగారు పార్లమెంట్ లో కూడా ధృవీకరించారు. కేంద్ర కాబినెట్ కూడా ప్రైవేటీకరణకు పచ్చ జండా ఊపింది. ఇప్పుడు ఎవరో కుట్ర చేస్తున్నారని ఏడుపు ఎందుకు? స్టీల్ ప్లాంట్ గురించి సమాధానం చెప్పమంటే పాస్టర్లకు డబ్బులు అంటూ పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు,” అని వారు ఆరోపిస్తున్నారు.
దొంగే దొంగ అని అరిచినట్టు ఉంది బీజేపీ వారి వ్యవహారం అని వారు ఎద్దేవా చేస్తున్నారు. గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ముందు ఈ అంశం తెర మీదకు వచ్చి బీజేపీని బాగా ఇబ్బంది పెట్టడం ఆ పార్టీకి మింగుడుపడటం లేదు. దానితో ఆ పార్టీ నేతలు బయటకు రాలేని పరిస్థితి వచ్చింది.
Vijay Deverakonda seems to be going through a disastrous and confusing phase in his career,…
Royal blue gets a fearless fashion upgrade as Preity Mukhundhan steps into the spotlight with…