
ఓ రోజు మధ్యాహ్నం ఉద్యోగం చేసి ఇంటికి రాగా, వంట గది నేలపై నీళ్ళు ఉండడం గమనించిన తానూ నీళ్ళు వెళ్లేందుకు సింక్ ఓపెన్ చేయడానికి వెళ్ళాను. కిచెన్ క్యాబినెట్ తెరిచి పైపులు చెక్ చేస్తూ క్యాబినెట్ లోకి పాకుతూ వెళ్లాను. ఎంత దూరం పాకుతూ వెళ్ళినా చివర దొరకకపోవడంతో, చాలా సేపు కిచెన్ క్యాబినెట్ లోపల పాకుతూ వెళ్ళిన తర్వాత ఓ సొరంగం కనిపించింది. ఈ సొరంగం ద్వారా వెళ్ళగా చివరకు ఓ వెలుగు కనిపించింది. అప్పుడు నాకు అర్ధమైంది, నేను 2042 సంవత్సరంలో ఉన్నానని, నా వయసు 72 సంవత్సరాలని!
అయితే అక్కడ ఉన్న వ్యక్తి తానో కాదో తెలుసుకోవడానికి చాలా ప్రశ్నలు వేశానని, తన చిన్నపుడు సంగతులన్నీ చెప్పాడని, అలాగే తన చేతి పైనే ఉన్న టాట్టూ ఒకే విధంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయమంతా జనాలకు చెప్తే ఇది అబద్దం అనుకునే ఆస్కారం ఉంది గనుక, తన చేతిలో ఉన్న మొబైల్ తో వీడియోను తీసానని ఓ వీడియోను పోస్ట్ చేసాడు. ఇది ఎవరు నమ్మినా, నమ్మకున్నా, భవిష్యత్తులో జరగబోయే కొన్ని సంఘటనలు అతను తనకు వివరించాడని తెలిపాడు.
అయితే ఇలాంటి ఘటనలకు ఎంతవరకు ఆస్కారం ఉంది? అంటే భూమి మీద అక్కడక్కడ ఉష్ణబిళాలు (వార్మ్ హోల్స్) ఉన్నాయని, వాటి గుండా భూతకాలంలోకి లేక భవిష్యత్తులోకి ప్రయాణించవచ్చని పారానార్మల్ పరిశోధకులు పేర్కొంటున్నారు. సామాన్య ప్రజల వరకు అయితే ఇదొక అద్భుతమనే చెప్పవచ్చు. అయితే ఇది నిజంగానే జరిగిందా? లేక సదరు వ్యక్తి సృష్టించిన అభూత కల్పనా? అన్నది మాత్రం ఎవరికి తెలియని విషయం. అయితే ఇది లేటెస్ట్ గా జరిగిన విషయం కాదు. దాదాపుగా 2006లో ఈ వీడియో పోస్ట్ చేయగా, పెరిగిన సోషల్ మీడియా పుణ్యమా అంటూ తాజాగా మరోసారి ఈ వీడియో హల్చల్ చేస్తోంది.
Rinku Singh has once again missed out on India’s T20I squad, and former India batter…
Salman Khan has been struggling to deliver a good film over the last few years.…