
హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయినా దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ సీక్వెల్ గా రాబోతున్న ‘జై హనుమాన్’ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.ఇప్పటికే 200 కోట్ల మార్కుని అందుకున్న హనుమాన్ థియేటర్లలో తన స్టామినా నిరూపిస్తూనే ఉంది. దీనితో ఈసారి కొట్టబోయేది ఇంతకూ మించి ఉండాలి అని ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్.
2024 సంక్రాంతి బరిలో పెద్ద హీరోల సినిమాలను తట్టుకుని విజయంలోనూ, వసూళ్లలోనూ ముందుకు దూసుకుపోతున్న హనుమాన్ ను లోబడ్జెట్ సినిమా అని, చిన్న హీరో నటించిన సినిమా అని, మీకు పెద్ద హీరోలతో పోటీ ఎందుకు అని, ఈ సినిమాకి నీ స్థాయికి సరిపోతుందా అంటూ చిన్న చూపు చూసిన వారందరికీ జై హనుమాన్ గురించి ఒక క్లారిటీ ఇచ్చారు ప్రశాంత్ వర్మ.
2025 లో రాబోయే జై హనుమన్ మూవీ హనుమాన్ కంటే 100 రెట్లు భారీ స్థాయిలో ఉండబోతుందని, ఆ సినిమాలో ఒక స్టార్ హీరో నటించబోతున్నారని తెలియచేసారు. హనుమాన్ సీక్వెల్ లో తేజ సజ్జ హీరో కాదని ఆంజనేయ స్వామే ఆ సినిమాకు హీరోగా ఉండబోతున్నారని ఆ పాత్రలో నటించడానికి ఒక స్టార్ హీరో రెడీగా ఉన్నారంటూ జై హనుమాన్ చిన్న సినిమా కాదని పరోక్షంగా హింట్ ఇచ్చారు.
హనుమాన్ మూవీ తో ప్రేక్షకులలో అంచనాలు పెంచిన ప్రశాంత్ జై హనుమాన్ తో ఆ అంచనాలను అందుకోగలరా..? జై హనుమాన్ రిలీజ్ కి ముందే అధీర, మహాకాళి తో మరోసారి ప్రేక్షకుల ముందుకి వస్తానంటూ చెప్పిన ప్రశాంత్ పాన్ ఇండియా స్థాయిలో తనకొచ్చిన క్రేజ్ ను నిలబెట్టుకుంటారా లేదా అనేది సినిమాల విడుదల తరువాతనే తెలుస్తుంది.
Thalapathy Vijay is one of the biggest names associated with Tamil cinema, and he has…
Vaibhav Sooryavanshi was once again left out of India's playing XI for the fourth T20I…