Telugu

‘డార్లింగ్’ కు ప్రేమతో….

బాహుబలి సినిమాతో నిజంగా ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులకు ‘రాజయ్యి’ కూర్చున్నాడు “ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు”. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మోలీవుడ్ అనే భాష బేధాలు లేకుండా సినిమా విడుదలైన ప్రతి భాష లోను తన స్టార్-డం, కట్ అవుట్ తో ఆది లోనే సినిమా కు కొండంత అండ అవుతున్నారు.

భాషతో పనిలేదు, టాక్ తో సంబంధం లేదు, తన సినిమా విడుదలతో బాక్స్ ఆఫీస్ పై దండ యాత్ర చేస్తున్నాడు ఈ ‘బుజ్జిగాడు’. బాహుబలి తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ అక్కడ కూడా అదే స్టార్ డమ్ ను అందుకుంటూ బాలీవుడ్ అగ్ర హీరోలకు ధీటుగా నిలబడ్డారు. దీనితో ‘వీడు ఎక్కడున్నా రాజేరా’ అంటూ ప్రభాస్ ఫాన్స్ తమ హీరో స్థాయికి మురిసి పోతున్నారు.

ADVERTISEMENT

ఇలాంటి డార్లింగ్ నేటితో ’45 ‘ మార్క్ ను అందుకోనున్నారు. అయితే మొన్న ‘రాజాసాబ్’ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రభాస్ పోస్టర్ ను చూసిన వారంతా ప్రభాస్ ను 45 ఏళ్ళ వయసున్నోడిగా కాకుండా పాతికేళ్ల కుర్రాడి లా ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆహార్యంలోనే కాదు ఆపన్న హస్తం అందించడంలోనూ తన పెద్ద మనసుని చాటుకుంటూ సమాజ హితం కోసం ఎన్నో విరాళాలను అందిస్తుంటారు ప్రభాస్.

ప్రభాస్ ఇంతవరకు పని చేసిన చిత్ర యూనిట్ దర్శకుడు, నిర్మాత నుంచి సహా నటుల వరకు అందరు ప్రభాస్ ప్రేమకు ఆయనను ‘డార్లింగ్’ అంటూ ప్రేమగా పిలుచుకుంటారు. అయితే ‘రాజాసాబ్’ యూనిట్ ప్రభాస్ పుట్టినరోజున ‘రాయల్ ట్రీట్ ఏవైట్స్’ అంటూ విడుదల చేసిన పోస్టర్ తో రాజు గారి అభిమానులు మేము సిద్దమే అంటూ వెయిటింగ్ లో ఉన్నారు.

దీనితో ప్రభాస్ బర్త్ డే ట్వీట్ కింద రాజాసాబ్ సినిమా టీజర్ ను విడుదల చేస్తుందేమో అన్న ఆశతో ప్రభాస్ ఫాన్స్ తో పాటుగా పాన్ ఇండియా సినీ అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. వయస్సుతో పాటుగా ప్రేక్షకుల అభిమానాన్ని, క్రెజ్ ను పెంచుకుంటూ చేతిలో నాలుగు సినిమాలతో ఎడ తెరుపు లేకుండా షూటింగ్స్ లో నిమగ్నమవుతున్నారు ప్రభాస్.

ప్రస్తుతం ‘రాజాసాబ్’ సెట్స్ లో ఉన్న ప్రభాస్, తరువాత హను రాఘవపూడి తో fouji, ఆ పై సలార్-2 , కల్కి-2 , వంగా స్పిరిట్ అంటూ భారీ లైన్ అప్ తో ఉన్న ఏకైక పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ రాజు పేరు గట్టిగానే వినపడుతుంది. గతంలో పెద్ద హీరో పుట్టినరోజు అంటే తానూ చేయబోతున్న కొత్త సినిమా యూనిట్ నుండి కచ్చితంగా ట్రైలర్ లేదా టీజర్ విడుదల చేసేవారు.

కానీ ఇప్పుడు పోస్టర్ తో సరిపెట్టేసి, రీ-రిలీజ్ అంటూ ఆ హీరో కెరీర్ లో ఉన్న ఒక సూపర్ హిట్ సినిమా ను మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. ఇలాగే, మహేష్ పుట్టినరోజున ‘మురారి’, పవన్ కు ‘గబ్బర్ సింగ్’ సినిమాలు థియేటర్లకు వచ్చి వెళ్లాయి. మరి ప్రభాస్ కు ఒకటీ, రెండూ కాదు, ఏకంగా 4 చిత్రాలు రీ-రిలీజ్ జరుపుకున్నాయి.

సలార్, మిస్టర్.పర్ఫెక్ట్, ఈశ్వర్, మిర్చి సినిమాలను రీ రిలీజ్ చేసారు చిత్ర యూనిట్స్. అయితే వచ్చే ప్రభాస్ సినిమాల లైన్ అప్ లో అన్ని క్రెజీ ప్రాజెక్టులే కావడంతో ప్రేక్షకులను ఎంతో ఊరిస్తున్నాయి. ఇందులో, డార్లింగ్ ఫాన్స్ చూపు అంతా ప్రస్తుతం ‘రాజాసాబ్’ మీదనే ఉంది. వింటేజ్ డార్లింగ్ ను మళ్ళీ చూస్తాం అనే ధీమా తో ఉన్నారు అభిమానులు.

చూడాలి మరి ఈ క్రేజీ లైన్-అప్ తో, బాక్స్ ఆఫీస్ పై ‘రెబెలోడి రచ్చ’ ఏ స్థాయి లో ఉంటుందని..? ఈశ్వర్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ప్రభాస్ కు ప్రేక్షకుల అభిమానంతో పాటుగా ఆ ఈశ్వరుడి ఆశీస్సులు కూడా దండిగా ఉండాలని ఆశిస్తూ M9 తరుపున కూడా రెబల్ స్టార్ ప్రభాస్ రాజు కు పుట్టిన రోజు శుభాకాంక్షలు, రాజాసాబ్ టీం కు ఆల్ ది బెస్ట్.

‘పెళ్లి’ అనే రెండక్షరాలకు దూరంగా ‘సినిమా’ అనే మూడు అక్షరాలకు దగ్గరగా, ‘రికార్డులు’ అనే నాలుగు అక్షరాలను బద్దలుకొడుతూ, నమ్మిన స్నేహానికి కట్టుబడి ఎంత ఎదిగిన మనందరి డార్లింగా ఒదిగే ఉన్నారు….ఉంటారు అంటూ ఆశిస్తూ ప్రేమతో టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ కు సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ప్రభాస్ అభిమానులు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Permission Granted, YS Jagan Flying To Europe

YS Jagan has active ED and CBI cases filed against him which mandates him to…

20 minutes ago

అందుకే మూడేళ్ళు కళ్ళు మూసుకోమంటున్నారు!

“మూడేళ్ళు కళ్ళు మూసుకుంటే చాలు మళ్ళీ మనమే” అని వైసీపీ శ్రేణులకు వారి అధినేత జగన్‌ భరోసా ఇస్తున్నారు. కానీ…

1 hour ago