
పవన్ రాజకీయ జీవితానికి ఒక దిశా దశ చూపించిన 2024 , మెగా స్టార్ సినీ జీవితానికి కూడా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను తెచ్చిపెట్టింది. అయితే 2024 సినిమా పరంగా నిరాశను కలిగించినప్పటికీ మెగా ఫాన్స్ కు ఎన్నో మరిచిపోలేని తీపి జ్ఞాపకాలను అందించింది. అయితే 2025 మాత్రం మెగా అభిమానులను కాస్త టెన్షన్ పెట్టడానికి సిద్దమయ్యింది.
ఈ ఏడాది మెగా ఫామిలీ నుంచి పెద్ద స్టార్స్ గా చెప్పబడే చిరు, చెర్రీ, పవన్ ల నుంచి ఒక్క సినిమా కూడా విడుదలకు నోచుకోలేదు. పవన్ రాజకీయాలలో బిజీగా ఉండడంతో సినిమాలకు దూరంగా జరగాల్సిన పరిస్థితి. అలాగే ఈఏడాది క్రిస్మస్ వేడుకగా రామ్ చరణ్ గేమ్ గేమ్ ఛేంజెర్ ధియేటర్లలో సందడి చేస్తుంది అనుకుంటే అది కాస్త వాయిదా పడింది.
ఇక మెగా స్టార్ చిరు నుంచి కూడా ఈఏడాది మెగా ఫాన్స్ కు నిరాశ తప్పలేదు. దీనితో 2025 మీద ఎన్నో అంచనాలతో ఉన్నారు మెగా అభిమానులు. మొదటిగా 2025 సంక్రాంతికి సందడి చేయాలనుకున్న చిరు విశ్వంభర సమ్మర్ కు వాయిదా పడింది. అలాగే ఈ స్థానాన్నిరామ్ చరణ్ గేమ్ ఛేంజెర్ అందిపుచ్చుకోనుంది. అయితే ఈ దసరా కానుకగా టీజర్ రూపంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన విశ్వంభర సినిమా మీద ఉన్న అంచనాలను ఒక్కసారిగా కిందకి నెట్టింది.
విశ్వంభర గ్రాఫిక్స్, విజువలేఫెక్ట్స్ మీద సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ నడుస్తుంది. దీనితో ఈ సినిమా ఫలితం మీద మెగా ఫాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే శంకర్ దర్శత్వంలో రాబోతున్న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మీద కూడా మెగా అభిమానులకు రోజురోజుకి ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి ‘వావ్’ అనిపించేలా ఒక్క ప్రమోషనల్ కంటెంట్ కూడా బయటకు రాలేదు.
దీనికి తోడు శంకర్ మునపటి ఫామ్ ను కోల్పోయి భారతీయుడు 2 ద్వారా ఎన్నో విమర్శలను మూటకట్టుకున్నాడు. దీనితో గేమ్ ఛేంజర్ ఫలితం మీద కూడా టెన్షన్ తప్పేలా లేదు. అలాగే గత కొన్నేళ్లుగా విడుదల కోసం సెట్స్ లో మగ్గుతున్న పవన్ హరిహర వీరమల్లు కూడా ఈ 2025 న థియేటర్లలోకి వచ్చే అవకాశం కచ్చితంగా ఉంది అంటూ మూవీ యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.
అలాగే దానికి తగ్గట్టే సినిమా షూటింగ్ కూడా పవన్ బస చేస్తున్న తాడేపల్లి పరిసర ప్రాంతాలలోనే ఇన్ డోర్ సెట్స్ ద్వారా పూర్తి చేస్తున్నారు. అయితే ఇన్నాళ్ల వాయిదాల తరువాత సెట్స్ మీదకు వచ్చిన హరిహర వీరమల్లు సినిమా మీద కూడా పెద్దగా బజ్ లేకపోవడం మెగా అభిమానులలో మరో ఆందోళనకు కారణం. ఇలా మెగా ఫామిలీ నుంచి 2025 లో విడుదలకు సిద్దమవుతున్న ఈ మూడు సినిమాలు మెగా ఫాన్స్ ను టెన్షన్ పెట్టబోతున్నాయా?
A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…
An Indian F-1 student finds herself in serious trouble. A misunderstanding at Walmart has left…