హర్ష్ కుమార్‌కు వైసీపీ వైరస్ సోకిందా?

పాస్టర్ ప్రవీణ్ మరణం పై పోలీస్ అధికారులు సీసీ టీవీ ఫోటేజ్ ల రూపంలో ఎన్ని ఆధారాలు బయటపెట్టినప్పటికీ కొంతమంది మాజీ రాజకీయ నేతలు, మరి కొంతమంది మత ప్రవక్తలు ఈ సాధారణ మరణనానికి మతం ముసుగు తొడిగి ఏపీలో మత విధ్వేషాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు.

ADVERTISEMENT

ఇందులో భాగంగా కొంతమంది దేవుని పేరు చెప్పుకుంటూ బైబిల్ సాక్షిగా అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారు. అలాగే ప్రవీణ్ మరణాన్ని అడ్డుపెట్టుకుని ఇప్పటికి కూటమి ప్రభుత్వం పై, ఆ ప్రభుత్వ పెద్దల పై తప్పుడు ఆరోపణలు చేస్తూ, హిందూ – క్రైస్తవుల మధ్య మత విద్వేషాలను రెచ్చకొడుతున్నారు.

మహా కూటమి ప్రభుత్వమా కాస్కో ఈ క్రైస్తుల దెబ్బ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం, క్రైస్తవుల జోలికి వచ్చిన ఏ ఒక్కడిని వదిలిపెట్టం. ఈ రాష్ట్రంలో ఆవులు చనిపోతే స్పందించే ప్రభుత్వం ఒక క్రెస్తవ మత ప్రవక్త చనిపోతే స్పందించదా.? అంటూ మతం ముసుగులో ప్రభుత్వం పై ప్రభుత్వ పెద్దల పై రెచ్చిపోతున్నారు.

అయితే జరిగింది ఒక యాక్సిడెంట్, తాగిన మత్తులో నిర్లక్ష్యంగా బైక్ డ్రైవ్ చేసిన కారణంగా చనిపోయిన వ్యక్తి ని అడ్డుపెట్టుకుని ఇది ప్రభుత్వ హత్య, ప్రభుత్వ నిర్లక్ష్యం అంటూ వ్యాఖ్యానించడం, దీనికి మతం రంగు పులవడం చూస్తుంటే గతంలో జరిగిన జగన్ బాబాయ్ వివేకా హత్య పై “నారాసుర రక్త చరిత్ర” అంటూ వైసీపీ ఆడిన జగన్నాటకం, సాక్షి చేసిన నీలి ప్రచారం గుర్తుకురాకమానదు.

ఇక వీరి ధోరణి ఇలా ఉంటే, మాజీ కాంగ్రెస్ నాయకుడు హర్ష కుమార్ తీరు మరోలా ఉంది. ఇదేదో సీఎం చంద్రబాబు నిర్లక్ష్యం ఫలితంగా సంభవించిన మరణం లా హర్ష కుమార్ చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధంగా కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం పై హర్ష కుమార్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే ఈ వ్యాఖ్యల వెనుక పెద్ద రాజకీయ కుట్రే దాగిఉంది అనిపించకమానదు.

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ని పట్టుకుని ఒరేయి చంద్రబాబు, అరేయి బాబు, నువ్వోముసలోడివి, మళ్ళీ విదేశాలలో పుట్టిన రోజు వేడుకలా.? సిగ్గుండాలి అంటూ దిగజారి మాట్లాడడం, అలాగే మంత్రి లోకేష్ ను ఉద్దేశించి అరేయి బాబు నీ బాబూ జైల్లో ఉన్నప్పుడు అంటూ సంభోదించడం,

ఇక ఆ ఎస్పీ గాడో, ఆ ఐజీ గాడేమో తెలియదు కానీ వేధవులు అంటూ పోలీస్ ఉన్నతాధికారుల పై నోరు పారేసుకోవడం, మీకంటే ఆ వైసీపీ ప్రభుత్వమే వెయ్యి రేట్లు మేలురా బాబు అంటూ భజన కార్యక్రమాలు చేయడం ఇలా హర్ష కుమార్, ప్రవీణ్ మరణం పై చేసిన హడావుడి చూస్తుంటే ఈయన గారికి “వైసీపీ వైరస్” సోకిందా అనిపిస్తుంది.

గత వైసీపీ ప్రభుత్వంలో ఇదే మాదిరి నోరు జారిన ఎంతోమంది వైసీపీ నేతలకు ప్రజలు ఓటు అనే ఆయుధం తో బుద్ది చెప్పి ఇంట్లో కూర్చోపెట్టారు. వారందరు కూడా ఇప్పుడు కనీసం మీడియా ముందుకొచ్చి గొంతెత్తలేని పరిస్థితిలో పడ్డారు.

అయితే ఇప్పుడు వారందరి స్థానాన్ని భర్తీ చేయడానికి వైసీపీ మతం రంగుతో మరో కొన్ని కొత్త బాణాలను రాష్ట్రంలో వదులుతుందా అన్నట్టుగా వైసీపీ సానుభూతి పరులు, ఆ పార్టీ సోషల్ మీడియా ఉన్మాదులు వీరు కూటమి ప్రభుత్వం ఆ ప్రభుత్వ పెద్దల పై మాట్లాడిన మాటలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తున్నారు.

హర్ష కుమార్ కూడా ఈ రకంగా అకారణంగా, అసందర్భంగా ముఖ్యమంత్రి పై ఈ రకమైన అనుచిత వ్యాఖ్యలు చేయడం, వైసీపీ పై ప్రశంసలు కురిపించడం చూస్తుంటే ఈ బాణం ఎవరి అమ్ముల పొదలో నుంచి బయటకు వచ్చిందో, అది ఎవరి కోసం ఈరకంగా బరితెగించి మాట్లాడుతుందో అనేది స్పష్టంగా తెలుస్తుంది.

నిజంగా వీరందరికి ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేకుంటే, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంత మంది దళిత వ్యక్తుల మీద వైసీపీ నాయకులు అన్యాయంగా దాడులకు తెగబడ్డారు, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్రహ్మణ్యం అనే కారు డ్రైవర్ ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన సంఘటనలో ఆ దళిత కుటుంబం అనాధల మారింది.

మరి ఆ పేద దళిత కుటుంబానికి అన్యాయం జరిగినప్పుడు ఈ సోకాల్డ్ క్రైస్తవ ప్రేమికులంతా ఎక్కడ దాక్కున్నారో.? సమాధానం చెప్పగలరా.? అలాగే కరోనా సమయంలో కేవలం మాస్క్ లు అడిగిన పాపానికి ఒక డాక్టర్ ను నడి రోడ్డు మీద అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ ఆయన్ను ఒక పిచ్చివాడిగా ముద్రవేసి ఆయన చావుకు పరోక్ష కారణమైన ముఖ్యమంత్రి జగన్ ను ప్రశ్నించేందుకు ఈ పెద్దమనుషులంతా నాడు ఎందుకు బయటకురాలేకపోయారో చెప్పగలరా..?

ఇటువంటి తెరచాటు రాజకీయాలకు ఇప్పుడు కాలం చెల్లిందని, అలాగే ఈ శవ రాజకీయాల మాయలో ఏపీ ప్రజలు పడరని, ఇప్పటికైనా ఈ రాజకీయాలను ఆడించే సూత్రదారులు, వాటిని తూచా తప్పకుండా ఆచరించే పాత్ర దారులు గ్రహిస్తే అది వారికే మంచిది అంటున్నారు కూటమి నేతలు.

Share
Manaswini K

Manaswini is a senior writer with extensive experience covering Telugu cinema, as well as the broader Indian film landscape, including Bollywood, Tamil, and other regional industries. With a strong focus on NRI (Non-R…

Published by

Recent Posts

December 4 Clash: Nithiin vs Naga Chaitanya

Tollywood’s December release race is getting more interesting, with Nithiin’s Alias Rukmini joining the December…

23 minutes ago

First Direction, Next Acting? Jason Sanjay in the Spotlight

Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…

53 minutes ago