Telugu

తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ని బాలీవుడ్ కి తీసుకెళ్తున్న సందీప్ వంగా

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ లతో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ వంగా ఇటీవల తన కొత్త చిత్రం యానిమల్ ని ప్రకటించాడు. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ఇందులో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రకటన చేస్తూ ఒక వీడియోను విడుదల చేశాడు. దాని నేపథ్య స్కోరు కు భారీ ఆదరణ లభించింది.

ADVERTISEMENT

యానిమల్ కోసం సంగీతం చేసేందుకు సందీప్ తన అర్జున్ రెడ్డి మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రమేశ్వర్ ను బాలీవుడ్ కి తీసుకెళ్తున్నాడని ఇప్పుడు విశ్వసనీయంగా తెలిసింది. ఇది యాక్షన్ నిండిన క్రైమ్ థ్రిల్లర్ అని చెబుతారు. సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది.

రణబీర్ కపూర్ తో పాటు, యానిమల్ లో అనిల్ కపూర్, బాబీ డియోల్ మరియు పరిణీతి చోప్రా కూడా నటించనున్నారు. షాహిద్ కపూర్ నటించిన కబీర్ సింగ్ కు పని చేసిన రచయితలు సిద్ధార్థ్ మరియు గారిమా ఈ చిత్రానికి డైలాగ్స్ రాస్తారు. ఈ ప్రాజెక్ట్ యొక్క మరిన్ని వివరాలు తరువాత చెబుతారు. కబీర్ సింగ్ బాలీవుడ్ లో అతిపెద్ద హిట్ గా నిలిచింది.

దాదాపుగా 300 కోట్లు రాబట్టింది. అయితే ఆ సినిమా తరువాత సందీప్ కి బాగా గ్యాప్ వచ్చింది. రణబీర్ తో డెవిల్ అనే సినిమా ప్రకటించిన తరువాత ఆగిపోయింది. ఆ తరువాత సందీప్ తెలుగులో సినిమా చేస్తాడని అన్నారు. అది కూడా జరగకుండా చాలా సమయం గడిచిపోయింది. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ తో సందీప్ అందరిని ఆశ్చర్యపరిచాడు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

AP Municipal Polls: Supreme Court Sets October 25 Deadline

The Supreme Court on Wednesday, October 21, directed the Andhra Pradesh State Election Commission (SEC)…

19 minutes ago

జనసేనని బలోపేతం చేసుకోకుండా టీడీపిని నిందించనేల?

టీడీపి-జనసేనల మద్య చిచ్చు పెట్టి విడదీసేందుకు వైసీపీ ఎంతగా ప్రయత్నించినా సాధ్యపడలేదు. కానీ ఇప్పుడు దానికి ఆ శ్రమ లేకుండా…

33 minutes ago