కుర్రకారు మనసు దోచిన ముద్దుగుమ్మ కమిట్ అయ్యింది!

hebah-patel-next-movie-confirmed, bhaskar, hebah hot“కుమారి 21ఎఫ్” చిత్రం ద్వారా యువతరం మనసులు కొల్లగొట్టిన హేబా పటేల్ ఎట్టకేలకు తన రెండవ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘కుమారి 21ఎఫ్’తో ఆఫర్లు వెల్లువలా వచ్చిపడతాయని భావించిన హేబాకు ఆశించిన మేరకు అవకాశాలు తలుపు తట్టలేదు. ‘నాన్నకు ప్రేమతో’ అవకాశం వచ్చిందన్న వార్తే కొన్నాళ్ళు హల్చల్ చేసింది గానీ, అది సినిమా విడుదలైన తర్వాత ఒట్టి పుకారే అని తేలిపోయింది.

దీంతో ఆఫర్ల కోసం వేచి చూస్తున్న హేబా పటేల్, ఒక కొత్త దర్శకుడికి ఓకే చెప్పింది. వి.వి.వినాయక్ వద్ద దర్శకత్వ శాఖలో పని చేసినటువంటి భాస్కర్ దర్శకత్వంలో ‘సినిమా చూపిస్త మావ’ నిర్మాత గోపి బ్యానర్ లక్కీ మీడియాలో “నేను – నా బాయ్ ఫ్రెండ్స్” చిత్రంలో నటించనుంది హేబా. టైటిల్ వింటేనే మరో యూత్ ఫుల్ చిత్రంగా స్పష్టమవ్వడంతో ‘కుమారి 21ఎఫ్’ తరహాలో మరోసారి వెండితెరపై హేబా తన విశ్వరూపం చూపించడం ఖాయం అంటున్నారు సినీ వర్గీయులు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories