Telugu

సినిమాల సక్సెస్ ఫెయిల్యూర్ ని మీమర్స్ నిర్ణయిస్తారా

ఎన్టీఆర్ కాలమైనా ప్రభాస్ రోజులైనా టెక్నాలజీలో సినిమాను చూసే విధానంలో మార్పులు వచ్చాయి కానీ ఎప్పుడైనా సరే కంటెంట్ గెలవాల్సిందే. ఊరికే ఆర్భాటాలని ప్రమోషన్ల హడావిడిని గుడ్డిగా నమ్మేసి ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు పెట్టే రోజులు కావివి. పోయిన శుక్రవారం పదికి పైగా కొత్త సినిమాలు రిలీజైతే థియేటర్లు పావు కూడా నిండలేదు. అదే మొన్న రిలీజైన నీలిరంగు మొహాలేసుకుని విచిత్ర లోకంగా అనిపించే అవతార్ 2కి చాలా చోట్ల టికెట్లు దొరకడం లేదు. ఇప్పుడు హాళ్లు కళకళలాడుతున్నాయి. పబ్లిక్ ఎవరో ప్రభావితం చేయడం వల్ల రాలేదు. స్వచ్చందంగా ఇష్టపడి స్వంతంగా అంచనాలు పెట్టుకుని ఎలా ఉందో తెలుసుకుని వస్తున్నారు.

సోషల్ మీడియా ప్రభావం ప్రతి రంగంలో ఉంది కాదనలేం. ప్రధాని నరేంద్ర మోడీ గెలుపులో దీని కృషిని తీసిపారేయలేం. అలా అని సినిమాలకూ అదే స్థాయి వర్తిస్తుందనుకుంటే అంతకన్నా కామెడీ మరొకటి ఉండదు. ఒకవేళ కాసేపు అదే నిజమనుకుందాం. మరి లైగర్, ఆచార్య లాంటి భారీ చిత్రాలకు కేవలం పోస్టులు ట్వీట్లతోనే కలెక్షన్లు రావాలి కదా. మెయిన్ స్ట్రీమ్ మీడియా సంయమనం పాటించిందేమో కానీ ట్విట్టర్ ఫేస్ బుక్ జనాలు మరీ దారుణంగా వాటితో ఆడేసుకున్నారు. ఇక్కడ మీమ్స్ పోషించిన పాత్ర చిన్నది కాదు. అలా అని బాగున్న వాటికి నాలుగు డబ్బులు ఎక్కువ వచ్చేలా చేసే సీన్ ఉందా అంటే దాని పర్సెంటేజ్ చాలా తక్కువ.

ADVERTISEMENT

తాజాగా జరిగిన 18 పేజెస్ ట్రైలర్ లాంచ్ లో కుర్ర హీరో నిఖిల్ మీమర్స్ ని ఆకాశానికెత్తేశాడు. మీతో మాట్లాడాలంటే భయమేస్తుందని, ఏదైనా చేస్తారని, చాలా జాగ్రత్తగా ఉండాలని అవసరానికి మించిన భయాన్ని ప్రదర్శించాడు. కార్తికేయ 2 సక్సెస్ లో మీ పాత్ర చాలా ఉందని, ఈవెంట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరికి విడిగా సెల్ఫీలు ఇస్తానని పదే పదే ప్రామిస్ చేశాడు. ఇందులో తప్పేమి లేదు. అయితే కార్తికేయ 2 హిట్ కావడం వెనుక వీళ్ళే ప్రధాన పాత్ర పోషించారనే స్థాయిలో మోసేయడమే హాస్యాస్పదంగా ఉంది. మరి ముంబై, ఢిల్లీ, కోల్కతా తదితర నగరాల్లోని నార్త్ ఆడియన్స్ చూసేందుకు తెలుగు మీమర్స్ ప్రభావం చూపించలేదు కదా.

కార్తికేయ 2కు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇచ్చిన మద్దతు చిన్నది కాదు. సినిమా బాగుంది కాబట్టే రివ్యూలతో మొదలుకుని కలెక్షన్ల వరకు పూర్తి సపోర్ట్ ఇవ్వబట్టే ఫలితానికి మరింత బూస్ట్ తోడయ్యింది. మీమర్స్ పాత్ర ప్రోత్సహించదగినదే కానీ మరీ ఇంత భుజాల మీద ఎత్తుకునేంత అయితే ఖచ్చితంగా కాదు. అసలే ఈ మధ్య ఫేక్ రివ్యూ రాయుళ్లతో ఐమ్యాక్స్ దగ్గర చేయిస్తున్న హంగామా, మీమర్స్ కి డబ్బులిచ్చి పాజిటివ్ పోస్టులు వేయిస్తున్న తతంగం ఎవరికీ తెలియంది కాదు. అసలు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలనే రేంజ్ లో ఒక సెటిల్డ్ హీరో వాళ్ళ గురించి కామెంట్ చేయడం చూస్తే ఇన్ఫ్లు యెన్సర్లు ఇకపై సెలబ్రిటీల కన్నా ఎక్కువ బిల్డప్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

IND vs WI 5th T20: Rain Washes Out Decider, Trophy Shared

The fifth T20I between India and West Indies was washed out due to rain at…

4 hours ago

Why Ranabaali Raises Big Doubts on Prabhas’ Fauzi?

Vijay Deverakonda’s Ranabaali is trying to maintain momentum at the box office after receiving mixed…

5 hours ago