Telugu

లేటు వయసులో చేసే సినిమాలతో తస్మాత్ జాగ్రత్త

ముప్పై ఏళ్ళకు సుదీర్ఘ అనుభవమున్న స్టార్ హీరోలకు లేటు వయసులో తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా తొందరపడ్డా జరిగే పర్యవసానాలను వెనక్కు తీసుకోలేం. ఇది ప్రతిఒక్కరికి అనుభవమే. అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్ పతి చేయడానికి ముందు దివాలా తీసే స్థితికి వెళ్లపోయారు. ఏబిసి కార్పొరేషన్ నష్టాలు, ఆ టైంలో నటించిన సినిమాలన్నీ డిజాస్టర్ కావడాలు ఇలా పెద్ద డ్యామేజే జరిగింది. కెబిసితో తానేంటో నిరూపించుకున్నాక మళ్ళీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం పడలేదు.

ఇప్పుడీ ప్రస్తావనకు కారణం విక్టరీ వెంకటేష్ తీసుకుంటున్న డెసిషెన్లు ఫ్యాన్స్ లో అసంతృప్తిని సగటు ప్రేక్షకుల్లో అనుమానాలను రేపుతున్నాయి. గత ఏడాది ఓరి దేవుడాలో చిన్న క్యామియో చేశారు. విశ్వక్ సేన్ లాంటి చిన్న హీరోని ప్రోత్సహించడం అవసరమే కానీ తన స్థాయికి తగని నిడివితో ఉన్న క్యారెక్టర్ వల్ల అటు సినిమాకు ఇటు ఈయనకు కలిగిన ప్రయోజనం ఏమీ లేదు. రానా నాయుడు వెబ్ సిరీస్ మీద వచ్చిన విమర్శల గురించి పెద్ద పుస్తకమే రాయొచ్చు. ట్రెండని ఏదో సమర్ధించుకునే ప్రయత్నం చేసినా ఆడియన్స్ ఒప్పుకోలేదు.

ADVERTISEMENT

ఇప్పుడు కిసీకా భాయ్ కిసీకా జాన్ లో కేవలం సల్మాన్ ఖాన్ తో స్నేహం వల్ల నటించడం నార్త్ లో ఇమేజ్ ని ఇంకాస్త డ్యామేజ్ చేసింది. ఎవరో మీడియం రేంజ్ హీరో నటించాల్సిన పాత్రని వెంకీ లాంటి పెద్ద స్టార్ చేయడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. పైగా రొట్ట రొటీన్ కంటెంట్ తో విమర్శకుల కంటే ఎక్కువ సాధారణ ప్రేక్షకుల తిట్ల వల్ల సోషల్ మీడియా ట్రోల్ మెటీరియల్ గా మారిపోయింది. దీని వల్ల వెంకటేష్ సాధించింది ఏమీ లేదు. పోనీ తెలుగు వెర్షన్ మార్కెటింగ్ కైనా పనికొచ్చిందా అంటే అదీ లేదు. అంతా వృథా ప్రయాసే.

సీనియర్ స్టార్లకు క్యాలికులేషన్లు చాలా అవసరం. ఎలాగూ కెరీర్ లో అన్నీ చూసేశాం కదా ఇప్పుడేం చేసినా చెల్లుతుందనే ధీమా కుదరదు. ఎందుకంటే వయసుతో సంబంధం లేకుండా అభిమానుల అంచనాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి తప్పించి ఒక స్టేజి దాటాక ఆగిపోవు. స్వర్గీయ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ చివరి చిత్రాలు మేజర్ చంద్రకాంత్, మనంలు అంత గొప్ప విజయం సాధించడానికి ప్రధాన కారణం ఇదే. వెంకటేష్ ఇకపై సెల్ఫ్ గోల్ లాంటి సినిమాలు చేయకూడదనేది ఫ్యాన్స్ తాపత్రయం. దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Jailer 2 BO 2nd Day: Rajinikanth’s 1000 Crore Dream ON?

Rajinikanth's Jailer 2 is maintaining strong momentum at the box office on its second day,…

4 hours ago

Why Ramayan Release Crucial for Shah Rukh Khan’s King?

Shah Rukh Khan’s fans have been eagerly waiting for an update on his next film,…

4 hours ago