Telugu

ఐఏఎస్‌లు ఉండగా సలహాదారులు ఎందుకు? వారి సంగతి తేల్చేస్తాం!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో సలహాదారుల నియామకంపై నిన్న హైకోర్టు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. దేవాదాయశాఖకు సలహాదారుగా శ్రీకాంత్ నియామకంపై గతంలో విధించిన స్టేని ఎత్తివేస్తూ దానిపై విచారణ జరిపినప్పుడు న్యాయస్థానం స్పందిస్తూ, ప్రభుత్వానికి అన్ని విదాల సహాయ సహకారాలు అందించేందుకే ఐఏఎస్ అధికారులు ఉన్నారు. ప్రభుత్వంలో ప్రతీశాఖకి ప్రత్యేక కార్యదర్శులుగా ఐఏఎస్ అధికారులు ఉన్నారు. వారు సంబందిత శాఖల మంత్రులకు అవసరమైనప్పుడు తమ అభిప్రాయాలు, సలహాలు ఇస్తుంటారు. కనుక వారు ఉండగా ప్రభుత్వం మళ్ళీ సలహాదారులను ఎందుకు నియమించుకొంటోంది. వారికి లక్షల రూపాయలు జీతభత్యాలు ఎందుకు చెల్లిస్తోంది?ఇంతకీ వారు ప్రభుత్వానికి ఏం సలహాలు ఇచ్చారు?వారు ఐఏఎస్ అధికారుల కంటే చాలా తెలివైనవారా?ఈ సలహాదారుల నియామకానికి సంబందించి రాజ్యాంగబద్దతని మేమే తేల్చేస్తాం. లేకుంటే ప్రభుత్వం రేపు ఎంఆర్వోలకి కూడా సలహాదారులు నియమించినా ఆశ్చర్యపోనవసరం లేదు. కనుక ప్రభుత్వం ఎంతమంది సలహాదారులను నియమించుకొంది? వారికి జీతభత్యాలుగా ఎంత చెల్లిస్తోంది? తదితర వివరాలన్నీ హైకోర్టుకి సమర్పించాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఏపీ ప్రభుత్వంలో సుమారు 56-75 మంది సలహాదారులు ఉన్నట్లు సమాచారం. మీడియా సేకరించిన లెక్కల ప్రకారమే 44 మంది తేలారు. మీడియా కనుగొన్న ప్రకారం చూసిన ఒక్కో సలహాదారుకి నెలకు కనీసం రూ.2 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తోందనుకొంటే 44 మందికి కలిపి నెలకు రూ.88 లక్షలైంది. ప్రభుత్వం జారీ చేసిన రహస్య జీవోలు ఎన్నో… ఇంకా ఎంతమంది ఉన్నారో?ఆ లెక్కన నెలకి, ఏడాదికి ప్రభుత్వం వారికి ఎంత ముట్టజెపుతోందో ప్రభుత్వానికే తెలియాలి.

ADVERTISEMENT

ఈరోజుల్లో అవుట్ సోర్సింగ్‌ ఉద్యోగం పొందాలన్నా… ఆ ఉద్యోగంలో ఒత్తిడి భరిస్తూ పనిచేయాలన్నా… దానిపై వచ్చే కొద్దిపాటి సంపాదనతో కుటుంబాన్ని పోషించుకోవాలన్నా ఎంతో కష్టం. ప్రభుత్వం అటువంటి అవుట్ సోర్సింగ్‌ సిబ్బంది మీద పెడుతున్న ఖర్చుని కూడా తగ్గించుకొనేందుకు ప్రయత్నిస్తుంటుంది. కానీ సలహాదారులకి మాత్రం అసలు ఏ పనీ చేయకుండానే నెలకు రెండు మూడు లక్షల జీతభత్యాలు చెల్లిస్తూ, వారిలో అసమదీయులకి క్యాబినెట్ హోదా కల్పిస్తుంటుంది ప్రభుత్వం. ఎంతో కష్టపడి పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్‌ సిబ్బంది మీద పెడుతున్న ఖర్చుని భారంగా భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పనిలేని, పనిచేయని సలహాదారుల మీద ఎందుకు వందల కోట్లు ఖర్చు చేస్తోంది? అంటే వారందరూ వైసీపీకి చెందిన రాజకీయ నిరుద్యోగులు, అసమదీయులు గనుక. అంటే మనోడైతే చాలు అడగకుండానే వడ్డించేస్తారన్న మాట!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

IND vs WI 5th T20: Rain Washes Out Decider, Trophy Shared

The fifth T20I between India and West Indies was washed out due to rain at…

26 minutes ago

Why Ranabaali Raises Big Doubts on Prabhas’ Fauzi?

Vijay Deverakonda’s Ranabaali is trying to maintain momentum at the box office after receiving mixed…

1 hour ago