
దాదాపు మూడేళ్ళుగా అమరావతి కోసం ఆందోళన చేస్తున్న రాజధాని రైతులు ఈ నెల 12వ తేదీన అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి వరకు మహాపాదయాత్ర చేసేందుకు సిద్దమయ్యారు. ఊహించినట్లే వారి పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తున్నట్లు డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి గురువారం అర్దరాత్రి జవాబు పంపారు. అమరావతి పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి గద్దె తిరుపతిరావు, ఏ.శివారెడ్డి వెంటనే హైకోర్టులో ఓ పిటిషన్ వేసి తమ పాదయాత్రను అనుమతించాల్సిందిగా కోరారు.
వారి పిటిషన్పై ఈరోజు విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం పోలీస్ శాఖ అభ్యంతరాలను పక్కనపెడుతూ నిశితమైన వ్యాఖ్యలు చేస్తూ, కొన్ని ఆంక్షలతో మహాపాదయాత్రకు అనుమతి మంజూరు చేసింది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, శ్రీకాకుళంలో నిర్వహించబోయే మహాపాదయాత్ర ముగింపు సభకు అమరావతి పరిరక్షణ సమితి ముందుగానే అనుమతి కోరుతూ పోలీసులకు దరఖాస్తు చేసుకోవలసిందిగా హైకోర్టు ధర్మాసనం సూచించడం. అంటే పోలీసులు దానికీ అనుమతి నిరాకరిస్తారని అప్పుడు రైతులు మళ్ళీ హైకోర్టును ఆశ్రయిస్తారని ముందే ఊహించినట్లు అర్దమవుతోంది. అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వం వైఖరి, దాని వ్యవహారాలు హైకోర్టు గమనించడంలేదనుకోవడం అవివేకమే అని ఈ ఒక్క సూచన తెలియజేస్తోంది.
The YSR Congress Party (YSRCP) is facing a major challenge in Andhra Pradesh’s Local Body…
Misha Narang gives casual dressing a stylish little shakeup in this breezy photoshoot. An oversized…