Telugu

ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యావ్ రాజమౌళి…!

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. యంట్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ స్పీడ్ పెంచి…లెటెస్ట్ అప్ డేట్స్ సందడి చేస్తున్నారు మూవీమేకర్స్.

అయితే ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ సాంగ్..నాటు…నాటు…ప్రోమో మంగళవారం రిలీజ్ అయ్యింది. తారక్, రాంచరణ్ ఇద్దరూ కూడా పవర్ ఫుల్ స్టెప్పులతో దుమ్ములేపినట్లుగా ఈ చిన్న ప్రోమోను బట్టి చూస్తే అర్థమవుతోంది. ఎంఎం కీరణవాణి సంగీతం అందించిన ఈ పాటను రాహుల్ సింప్లిగంజ్, కాలభైరవ ఆలపించారు. అయితే బుధవారం సాయంత్రం ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు.

ADVERTISEMENT

ఇదిలా ఉండగా దాదాపు రూ. 5వందల కోట్ల భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమాను రూపొందిస్తున్నారు రాజమౌళి. కానీ ఈ సినిమాకు రావాల్సినంతగా హైప్ ఇప్పటి వరకు రాలేదు. మొన్న ఆ మధ్య రిలీజ్ చేసిన టీజర్ పర్వాలేదు అనిపించినప్పటికీ….ఈ మూవీకి సంబంధించి ఏవి కూడా ప్రమోషనల్లో రాజమౌళి స్థాయి చిత్రాలను అందుకోలేవు.

దాంతో ఇవాళ రిలీజ్ అయిన నాటు…నాటు…వీరనాటు..ఊరనాటు అంటూ సాగిన ఈ పాట చాలా కీలకంగా మారింది. ఈ పాటలో ఇద్దరు బెస్ట్ డ్యాన్సర్లు రాంచరణ్, తారక్ పవర్ ఫుల్ స్టెప్పులతో అదరగొట్టేసినట్లుగా ప్రోమోలో హింట్ ఇచ్చారు డైరెక్టర్ రాజమౌళి.

ఈ పాట ఆర్ఆర్ఆర్ సినిమాకు చాలా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాదు సినిమా మొత్తానికి కూడా హైప్ తీసుకొచ్చే పాట కూడా ఇదే అవుతుంది. మరి ఇలాంటి పాటకు తప్పనిసరిగా వీడియోను రిలీజ్ చేయాలి. కానీ బుధవారం ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నప్పటికీ…ఫుల్ వీడియో సాంగ్ ను విడుదల చేయడం లేదు.

అయితే ఈ ప్రోమోలో ఇద్దరు హీరోలు వెస్ట్రన్ డ్రెస్సులతో డ్యాన్స్ చేస్తున్న స్టిల్స్ ఉన్నాయి. ఈ ఇద్దరు హీరోలు డ్యాన్స్ చేస్తున్న విధానం చూస్తుంటే…బాగా క్లిక్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో పూర్తిగా వీడియో సాంగ్ ను రిలీజ్ చేయకుండా…కేవలం లిరికల్ సాంగ్ ను విడుదల చేయడం రాజమౌళి చేస్తున్న పెద్ద మిస్టెక్ అని చెప్పొచ్చు. ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేస్తే…సినిమా రిలీజ్ కు ముందే ఎక్కడాలేనంతగా హైప్ వస్తుండేనన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Share
Manaswini K

Manaswini is a senior writer with extensive experience covering Telugu cinema, as well as the broader Indian film landscape, including Bollywood, Tamil, and other regional industries. With a strong focus on NRI (Non-R…

Published by
Tags: cross link

Recent Posts

CBN’s RK Beach Visit Goes Beyond Muri Mixture Moment

Chief Minister Chandrababu Naidu’s visit to Visakhapatnam’s RK Beach offered a glimpse of his informal…

1 hour ago

Akshay & Kareena Deliver the Biggest BO Shocks of 2026

The year of 2026 is not over yet, and it has already delivered two big…

2 hours ago