Telugu

రాధాకృష్ణ విజయం ఓ లెక్క.. వైసీపీ ఓట్లు మరో లెక్క!

మాజీ ఐపీఎస్ అధికారి ఏబీవీ రావు కాంగ్రెస్‌, వామపక్షాల మద్దతుతో హఠాత్తుగా విజయవాడ మేయర్‌ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. ఆయనకు విజయవాడ ప్రజల్లో మంచి పేరే ఉంది. విజయవాడ సమస్యల పట్ల అవగాహన కూడా ఉంది. కనుక ఆయన కూటమి, వైసీపీలకు గట్టి పోటీ ఇస్తారనే అందరూ అనుకున్నారు.

విజయవాడలో మంచి ఫాలోయింగ్ ఉన్న వంగవీటి రాధాకృష్ణ జనసేన అభ్యర్థిగా బరిలో దిగడంతో పోటీ వారిద్దరి మధ్యే ఉంటుందని, ఈ కారణంగా వైసీపీ మేయర్‌ అభ్యర్థి రాయని భాగ్యలక్ష్మి నష్టపోతారనే విశ్లేషణలు వినిపించాయి.

ADVERTISEMENT

కానీ ఏబీవీ రావుకు కేవలం 12,657 ఓట్లు మాత్రమే రావడంతో డిపాజిట్ కోల్పోగా, వారిద్దరి మధ్య పోటీలో కనిపించకుండా పోతారనుకున్న వైసీపీ అభ్యర్థి రాయని భాగ్యలక్ష్మికి 1,35,056 ఓట్లు వచ్చాయి.

దీంతో ఆమె రెండో స్థానంలో నిలిచి, కూటమికి వైసీపీతోనే పోటీ అని మరోసారి నిరూపించారు. ఈ మేయర్‌ ఎన్నికల్లో 2,65,968 ఓట్లు సాధించిన వంగవీటి రాధాకృష్ణ ఆమెపై 1,30,912 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. విజయవాడ మేయర్‌ పదవి చేపట్టబోతున్నారు.

అయితే ఇక్కడ చర్చ ఏబీవీ రావు డిపాజిట్ కోల్పోవడమో లేదా వంగవీటి రాధాకృష్ణ ఇంత భారీ మెజార్టీతో గెలిచి మేయర్‌ పదవి చేపట్టబోతుండటమో కాదు.

రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభంజనంలో వైసీపీ తుడిచిపెట్టుకుపోతుంటే, వైసీపీ మేయర్‌ అభ్యర్థి రాయని భాగ్యలక్ష్మి ఆ ప్రభంజనాన్ని తట్టుకొని 1,35,056 ఓట్లు (సుమారు 32.65 శాతం) సాధించడం మామూలు విషయం కాదు.

అంటే విజయవాడలో వైసీపీకి గణనీయమైన ఓటర్ల మద్దతు ఉందని స్పష్టమైంది. కనుక వచ్చే ఎన్నికల్లో కూడా కూటమి పార్టీలు ఈ లెక్కలు దృష్టిలో ఉంచుకునే అభ్యర్థులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Cyclone Murasu: Chandrababu Conducts Aerial Survey of Crop Damage

Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu undertook an aerial survey of Cyclone Murasu-affected areas…

17 minutes ago

Regina Questions Gender Bias in Star Celebrations

In the South, a star hero's film release is no less than a festival for…

22 minutes ago