ఖమ్మం నుండి హైదరాబాద్ వెళుతున్న సమయంలో ‘బాపూ బొమ్మ’ ప్రణీత కారు బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసిన సినీ ప్రేక్షకులు, ప్రణీత అభిమానులు కాస్త కంగారు పడ్డారు. అయితే “తానూ సేఫ్ గా ఉన్నానని, తన హెయిర్ స్టైలిస్ట్ కు కాస్త దెబ్బలు తగిలాయని, దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెళ్ళారని” ప్రణీత సమాచారం అందించింది.
అయితే యాక్సిడెంట్ తర్వాత తానూ ఓ మినీ బస్సులో బాడీ గార్డ్స్ తో పయనిస్తున్నానని ఓ రెండు ఫోటోలను షేర్ చేసింది. బస్సు నిండా బాడీ గార్డ్స్ తో ఉన్న ఈ ఫోటోలను చూసి… ‘ప్రణీతను కిడ్నాప్ చేసినట్లుగా ఉందని’ నెటిజన్లు రకరకాల కామెంట్లు వేస్తున్నారు. మొత్తానికి ఈ ఆదివారం ఓ గండం నుండి బయటపడడం ప్రణీత వంతయ్యింది.
ADVERTISEMENT
ADVERTISEMENT





