Telugu

పెద్ద నిర్ణయాలే కాదు… చిన్నవి కూడా అవసరమే

కాలంతో పాటు మనిషీ మారుతుంటాడు. ఆలోచనల నుంచి ఆహారపు అలవాట్ల వరకు అన్నీ కాలానుగుణంగా రూపాంతరం చెందుతాయి. ఈ మార్పులు చేర్పులతోనే జీవితం ముందుకు సాగుతుంది. కొన్ని మార్పుల కోసం పెద్ద నిర్ణయాలు అవసరం అవుతాయి. మరికొన్ని సంఘటనలు మన ప్రమేయం లేకుండానే జీవిత దిశను మార్చేస్తాయి.

అయితే దైనందిన జీవితంలో చిన్న ఆలోచనలు, చిన్న నిర్ణయాలు, మాటలు కూడా గొప్ప మార్పులకు కారణమవుతాయి. కష్టకాలంలో ఉన్న స్నేహితుడికి చెప్పే ఓ ఓదార్పు మాట, చేసే ఓ చిన్న సాయం బంధాలను మరింత బలంగా మార్చగలవు.

ADVERTISEMENT

విజయం సాధించడానికి మానవ ప్రయత్నం తప్పనిసరి. కానీ ప్రతి సందర్భంలో ఒంటరి ప్రయాణమే విజయానికి దారి కాదని కూడా గుర్తించాలి. కొన్నిసార్లు ఇతరుల సాయం మనల్ని ముందుకు నడిపిస్తుంది. అదే విధంగా మనం కూడా ఇతరుల విజయానికి కారణం కావచ్చు.

అగ్రస్థాయికి చేరిన సినీ నటులు తమ విజయానికి అభిమానులే కారణమని చెబుతుంటారు. అది కొందరికి నాటకీయంగా అనిపించినా, అందులో వాస్తవం ఉంది. ప్రోత్సాహం, మద్దతు మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.

మనిషి విజయం సాధించడం ఎంత అవసరమో, ఇతరుల ఎదుగుదల చూసి అసూయ చెందకుండా ఉండటం కూడా అంతే అవసరం. అసూయ మన మనసును, నిద్రను, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. చివరికి మనమే నష్టపోతాం.

అసూయ కలిగితే దాన్ని వీలైనంత త్వరగా వదిలించుకోవాలి. అదే సమయంలో మనం ఎందుకు ఆ స్థాయికి ఎదగలేకపోయామో ఆలోచించాలి. ఈ ఆత్మవిమర్శే మన అభివృద్ధికి దారి చూపుతుంది.

డబ్బు, ఆస్తులు, విలాసాలతో పాటు మానవ సంబంధాలు కూడా జీవితానికి అత్యంత అవసరం. అవి దెబ్బతిన్నప్పటి నుంచే మనిషి పతనం మొదలవుతుంది. అందుకే అవసరమైనవి, అనవసరమైనవి వేరు చేయగలగడం చాలా ముఖ్యం.

ఎప్పటికప్పుడు ఆత్మావలోకనం చేసుకోవడమే పరిణతి. ఆ పరిణతి వచ్చినప్పుడు జీవితం సులభమవుతుంది. ముందుకు సాగడం తేలికవుతుంది. అప్పటికి అపజయాలు కూడా మనల్ని కుంగదీయలేవు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Bigg Boss Telugu: Two Evictions Already In The House

For the first time in Bigg Boss history, there is a double eviction in the…

4 hours ago

Toxic English Version Flops: Yash’s Ramayana at Risk?

Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…

6 hours ago