
దాదాపు 700కు పైగా ద్వీపాలు, ఎన్నో బీచ్ లు, రిసార్టులు, పర్యాటకుల సందడితో ఉండే ‘బహమాస్’ కకావికలం కాగా, దీవుల చుట్టూ ఉన్న సముద్రం మాయమైన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తుపాను సుడులు సముద్రం నీటిని లోపలకు లాక్కున్నాయని, ఆపై 13 గంటల తరువాత, తిరిగి నీరు చేరుకుంది. అయితే ఓ ‘బహమాస్’ నివాసి మాయమైన సముద్రాన్ని ఫోటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా, అవి వైరల్ అవుతున్నాయి.
‘ఇర్మా’ సృష్టించిన భయం ఇంకా పోకమునుపే ‘జోస్’ రూపంలో మరో పెను ప్రమాదం పొంచి ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ‘పుండు మీద కారం చల్లుతున్నట్టు’ మరో తుఫాన్ ‘జోస్’ భీకరంగా మారి తీరం వైపు దూసుకోస్తోందని చేస్తోన్న హెచ్చరికలు ప్రజలలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కరేబియన్ దీవి బార్బుడాను వణికించి, నామరూపాల్లేకుండా చేసిన ‘ఇర్మా’ వెళ్లిపోయిన నాలుగు రోజుల వ్యవధిలోనే ‘జోస్’ బయలుదేరింది. కేటగిరీ 4 హెచ్చరికలతో వస్తున్న జోస్, బార్బుడాపై మాత్రం కాస్తంత కరుణ చూపుతూ, మిగతా దీవులపై భారీ వర్షాలతో కరేబియన్ దీవులపై విరుచుకుపడింది.
‘జోస్’ మరో మూడు నాలుగు రోజుల తరువాత అమెరికా తీరాన్ని తాకవచ్చని అంచనా. దీంతో అమెరికా మరింత ఆందోళన చెందుతోంది. ఇదిలా ఉంటే, సెల్ఫీ క్రేజ్ తో ‘ఇర్మా’తో సెల్ఫీ దిగాలని ప్రయత్నించి ఓ జంట ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఫ్లోరిడాకు దక్షిణంగా సముద్రంలో విహరిస్తున్న ఓ జంట, ఇర్మా ప్రభావంతో పది అడుగులకు పైగా ఎత్తులో వస్తున్న అలలకు ఎదురుగా నిలబడి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించింది. ఉద్ధృతంగా వచ్చిన అల అతన్ని బలంగా తాకగా, బొక్క బోర్లా పడ్డాడు. అలల బలం అప్పటికి తెలిసొచ్చిందో ఏమో? వెంటనే లేచి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
Pawan Kalyan’s birthday celebrations are getting another update from the team of OG. Director Sujeeth…
Toxic is slowing down at the box office, and Tuesday’s numbers have added to the…