
బాలానగర్ లోని ఎక్సైజ్ కార్యాలయంలో జరిగిన ఈ విచారణలో ఈడీ అకున్ సబర్వాల్ స్వయంగా పాల్గొన్నారు. అసలు బ్యాచ్ వేరే ఉందని చెప్పిన కెల్విన్, సెలబ్రిటీలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని అత్యధిక శాతం దాటవేసినట్టు సిట్ వర్గాలు తెలుపుతున్నాయి. కొకైన్ తీసుకోవడాన్ని ఉన్నత వర్గాల్లో స్టేటస్ సింబల్ గా భావిస్తుంటారని, అందుకే బిగ్ షాట్స్ అంతా ఇందులో ఉంటారని చెప్పిన కెల్విన్, వారితో గల సంబంధాలపై మాత్రం పెదవి విప్పకపోవడం విశేషం.
దీనికి మరింత సమాచారం జీషన్ వద్ద ఉంటుందని, జీషన్ ను విచారిస్తే ఈ వ్యవహారంలో పెద్దల పేర్లు బయటకు వస్తాయని చెప్పడంతో, గత వారంలో ఓ స్టార్ హోటల్ సమీపంలో అరెస్ట్ అయిన జీషన్ ను కస్టడీలోకి తీసుకోవాలని సిట్ అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. వారాంతాలతో పాటు, వినాయక నిమజ్జనాలు జరిగే చివరి నాలుగు రోజుల్లో ఎల్ఎస్డీ డ్రగ్స్ కు విపరీతమైన డిమాండ్ ఉంటుందని, తాను ప్రతి నెలా గోవాకు వెళ్లి ఎంజాయ్ చేసి వస్తుంటానని కూడా కెల్విన్ వెల్లడించినట్టు తెలుస్తోంది.
Glenn Maxwell's international career has come to an end after 14 years with Australia. The…
Shah Rukh Khan and Deepika Padukone’s ‘Tu Mil Jaaye’ from King has become a target…