Telugu

వైరల్ వీడియో: రాంగ్ రూట్ కి రైట్ ట్రీట్మెంట్

రోడ్డు ప్రమాదాలలో చాలావరకు డ్రైవర్ల నిర్లక్ష్యమే ఎక్కువగా కనిపిస్తుంది. అతివేగం, ముందు వెనుక చూడకుండా డ్రైవ్ చేయడం, డ్రంక్ అండ్ డ్రైవ్ ఇలా ఎన్నో కారణాలు రోడ్డు ప్రమాదాల సంఖ్యను పెంచుకుంటూపోతున్నాయి. అయితే రాంగ్ రూట్ డ్రైవింగ్ కూడా వీటి కోవలోకే వస్తుంది.

యూ టర్న్ కొట్టాలనో, ఏముందిలే పక్కన నుంచి వెళ్ళిపోదామనే డ్రైవర్ నిర్లక్ష్యం కూడా మృత్యువును ఆహ్వానించడమే అవుతుంది. అయితే ఈ రాంగ్ రూట్ డ్రైవింగ్ ల ప్రమాదం గురించి తెలిసి కూడా సాధారణంగా టూ వీలర్స్ వాహనదారులు ఈ రాంగ్ రూట్ ని ఎంచుకుంటారు.

ADVERTISEMENT

అసలు ఒక బైక్ రాంగ్ రూట్ లో రావడమే ట్రాఫిక్ నిబంధలకు విరుద్ధం అనుకుంటే ఇప్పుడు ఏకంగా ఒక ఆర్టీసీ బస్సు వన్ వే లో, రాంగ్ రూట్ లో రోడ్ల మీద తిరుగుతుంది. అయితే వీటన్నిటి గురించి వినిడడం, చూడడం సమాజంలో సర్వసాధారనమైన విషయమే కావడంతో దీన్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు.

ఎవరికీ వారు మనకెందుకులే, ఇది మన పని కాదులే అని రోడ్ల మీద ఇటువంటి సంఘటనలు చూస్తూ, స్వయంగా ఇబ్బందులు పడుతూ కూడా పక్కన నుంచి తప్పించుకుని వెళ్ళిపోతారు. కానీ ఒక వ్యక్తి ఆ రాంగ్ రూట్ కి రైట్ ట్రీట్మెంట్ ఇస్తూ బస్సుకు అడ్డంగా నిలబడ్డాడు.

హైద్రాబాద్ మహానగరంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హైద్రాబాద్ లో రద్దీగా ఉండే రాజపుష్ప వద్ద ఆర్టీసీ బస్సు ఒకటి వన్ వే లో రాంగ్ రూట్ లో ప్రయాణిస్తుంది. ఇది చూసిన ఒక వ్యక్తి ట్రాఫిక్ నిబంధలను విరుద్ధంగా రాంగ్ రూట్ లో వస్తున్న బస్సుకి ఎదురుగా తన బైక్ ని అడ్డుపెట్టి ఆ బస్సుని ముందుకు పోనీయకుండా అడ్డుపడ్డాడు.

బస్సును ఇలా నిర్లక్ష్యంగా రాంగ్ రూట్ లో నడుపుతున్న బస్సు డ్రైవర్ ని అదే రోడ్డు మీద నిలదీసాడు. డ్రైవర్ అప్పటికి తానూ చేసిన తప్పు ఒప్పుకోకుండా సదరు వ్యక్తితో వాగ్వాదం చేస్తూ రోడ్డు మీద ట్రాఫిక్ సమస్యను సృష్టించాడు. ఆర్టీసీ వంటి బాధ్యతాయుతమైన సంస్థలోని ఉద్యోగులే ఇలా బాధ్యతరహిత్యంగా వ్యవహించడం ముమ్మాటికీ నేరంగానే పరిగణించాలి.

సదరు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రోడ్డు మీద అనుకోని సంఘటన ఏమైనా జరిగితే.? దాని తాలూకా ఫలితం రెండు తరాలు అనుభవించవలసి వస్తుంది. అయితే రోడ్డు మీద ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఇలా నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిని మనం నిత్యం ఏదొక చోట చూస్తూనే ఉంటాం.

కానీ ఆ నిబంధనలను పాటించని వాడిని ప్రశ్నించే వాడిని, వారికీ ఎదురునిలబడి నిలదీసేవాడిని మాత్రం చాల అరుదుగా చూస్తుంటాం. అలాంటి ఒక అరుదైన వ్యక్తి ఇప్పుడు తానూ చేసిన ఆపనితో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. ఈ వీడియో చూసిన వారు సైతం రాంగ్ రూట్ కి రైట్ ట్రీట్మెంట్ ఇచ్చారు బ్రో అంటూ సదరు వ్యక్తిని అభినందిస్తున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

AK47: Trivikram & Naga Vamsi Fumble Golden Dasara Window

Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…

1 hour ago

New Passport Rules for Minors NRI Parents Must Know

The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…

2 hours ago