
ఈ అంశంపై దాదాపు 100 మంది ఐటీ కంపెనీల ప్రతినిధులతో బుధవారం అధికారులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఐటీ, జీహెచ్‌ఎంసీ, ఆర్టీసీ, టీఎస్‌ఐఐసీ, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కార్‌పూలింగ్‌ని ప్రోత్సహించి, ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచితే పరిస్థితి మెరుగవుతుందని అభిప్రాయపడ్డారు. రహేజా పార్కు – రాయదుర్గం, బయోడైవర్సిటీ పార్కు – ఐకియా మార్గంలో కార్ల రద్దీ ఎక్కువగా ఉంది. రాయదుర్గం పరిధిలో పలు సంస్థలు కొత్త నిర్మాణాలు ప్రారంభించాయి. దీనివల్ల కూడా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది.
ఈ మార్గాల్లో రద్దీ తగ్గించేందుకు కార్‌పూలింగ్ విధానాన్ని ప్రోత్సహించాలని వారు అభిప్రాయపడ్డారు. మాదాపూర్, హైటెక్ సిటీ మార్గంలో ఆర్టీసీ సేవల్ని మరింత విస్తృతం చేయాలి. అలాగే ప్రైవేటు పార్కింగ్ స్థలాల్లో ఫీజును పెంచాలి. దిల్లీలో పార్కింగ్ లాట్ ఫీజు రూ.5 వేలుగా ఉంది. ఇక్కడా ఈ విధానం పెడితే కొంత వరకైనా కార్ల రద్దీ తగ్గించవచ్చు అని కూడా వారు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఐటీ కారిడార్ కు మెట్రో అందుబాటులోకి వచ్చిన కారణంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని అంతా ఒక అంగీకారానికి వచ్చారు.
Suriya’s long delayed project Karuppu, directed by RJ Balaji, is finally set for a worldwide…
The Tamil film industry must be very proud about the fact that one of their…